'2.ఓ' చిత్రం నుండి లిరికల్ వీడియోలు విడుద‌ల‌

Sat,October 20, 2018 11:47 AM
Endhira Logathu Sundariye song from 2.0

స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిన క్రేజీ ప్రాజెక్ట్ 2.ఓ. నవంబ‌ర్ 29న విడుద‌ల కానున్న ఈ చిత్ర టీజ‌ర్‌ వినాయ‌క చ‌వితి శుభాకాంక్ష‌ల‌తో విడుద‌ల కాగా, ఈ టీజ‌ర్ 24 గంట‌ల‌లో 32 మిలియ‌న్స్‌కి పైగా వ్యూస్ రాబ‌ట్టి అంద‌రికి షాక్ ఇచ్చింది. విజువ‌ల్ ఎఫెక్ట్స్ మాయాజాలం అంద‌రిని అబ్బుర‌ప‌ర‌చ‌గా, చివ‌ర‌లో ర‌జ‌నీ స్పెడ్స్‌ని పైకి ఎత్తి కుకూ అంటూ చెప్పే డైలాగ్ అభిమానులు ఉర్రూత‌లూగేలా చేసింది. ఈ చిత్రం కోసం 1000 మంది వీఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్స్ ప‌ని చేయ‌గా, కాన్సెప్ట్ ఆర్టిస్టులు 10, 3డీ డిజైన‌ర్స్ 25 మంది, క్రాఫ్ట్స్ మాన్ 500 మంది ప‌ని చేశారు. ఈ చిత్రంలో అక్ష‌య్ కుమార్, అమీజాక్స‌న్‌లు చిత్రంలో ముఖ్య పాత్ర‌లు పోషించారు. దాదాపు 545 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ చిత్రాన్ని రూపొందించింది లైకా సంస్థ‌. అయితే రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో చిత్ర బృందం ప్ర‌మోష‌న్స్ జోరు పెంచుతుంది. తాజాగా రెండు లిరిక‌ల్ సాంగ్ వీడియోల‌ని విడుద‌ల చేసింది మూవీ టీం. ఎందిర లోగొత్తు సుంద‌రియ‌, రాజాలి అంటూ సాగే ఈ పాట‌ల‌కి మంచి రెస్పాన్స్ వ‌స్తుంది. ఏఆర్ రెహ‌మాన్ స్వ‌ర‌ప‌ర‌చిన బాణీల‌కి ఇప్ప‌టికే మంచి రెస్పాన్స్ వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

1857
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles