ఇమ్రాన్ హ‌ష్మీ నిర్ణ‌యానికి ప్ర‌శంస‌లు

Fri,October 12, 2018 10:21 AM
Emraan Hashmi takes nice decision

బాలీవుడ్ కిస్సింగ్ స్టార్ ఎవ‌రంటే అంద‌రికి ఠ‌క్కున గుర్తొచ్చేది ఇమ్రాన్ హ‌ష్మి. త‌న ప్ర‌తి సినిమాలో కిస్ సీన్ లేకుండా ఉండ‌దంటే అతిశ‌యోక్తి కాదు. అయితే ముందు హీరోయిన్స్‌తో చ‌ర్చించాకే ఆ విష‌యంపై నిర్ణ‌యం తీసుకుంటాడ‌ట ఈ ముద్దుల హీరో. తాజాగా తాను ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో శృంగార స‌న్నివేశాలు లేదా ముద్దు సీన్స్‌పై హీరోయిన్స్‌తో చ‌ర్చించాక‌, వారు అభ్యంతరాలేమి చెప్ప‌క‌పోతే ఆ స‌న్నివేశాల‌లో పాల్గొంటాన‌ని అన్నాడు. వెండితెర‌పై ర‌చ్చ చేసే ఈ హీరో తాజాగా మీటూ ఉద్యంపై త‌న నిర్ణయం ప్ర‌క‌టించారు. దీంతో ఆయ‌న‌పై ప్ర‌శంస‌లు వ‌ర్షం కురుస్తుంది. త‌న కంపెనీల‌లో ఎవ‌రైన లైంగిక వైధింపుల‌కి పాల్ప‌డితే స‌హించేదే లేద‌ని ఇమ్రాన్ తెలిపాడు. కార్యాలయాల్లో మహిళలపై లైంగిక వేదింపులు నివారణ చట్టం 2013ను తన కంపెనీలో అమల్లోకి తెస్తున్నట్లు చెప్పారు. ప్ర‌స్తుతం ఇండియా అంతటా మీటూ ఉద్య‌మం చ‌ర్చ‌నీయ‌మైన నేప‌థ్యంలో ప్ర‌ముఖులు అంద‌రు త‌న వాద‌న‌ని వినిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇమ్రాన్ హష్మీ త్వరలో ‘చీట్ ఇండియా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. దేశంలోని విద్యా వ్యవస్థపై సౌమిక్ సేన్ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా 2019, జనవరి 25న విడుదల కానుంది .

1982
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS