విభిన్న అవతారాల్లో కిస్సుల కింగ్‌

Thu,October 6, 2016 11:21 AM
Emraan Hashmi  Photoshoot

బాలీవుడ్‌ హీరో.. కిస్సుల కింగ్ ఇమ్రాన్ హష్మి తాజాగా ఓ మ్యాగజైన్‌ కోసం ఫోటో షూట్‌ చేశాడు. మోడల్‌ ఎలీనా రోక్సానా మారియా ఫెర్నాండేజ్ తో కలిసి ఫోటో షూట్‌ లో పాల్గొన్నాడు. ప్రముఖ విలన్‌ పాత్రలు అయిన జోకర్ , హన్నీబల్‌ లెక్టర్ , వాల్టర్ వైట్‌ అకా హీసన్ బర్గ్‌ మరియు అరో పాత్రల లుక్ లో ఇమ్రాన్ హష్మి కనిపించాడు. ఇమ్రాన్ పై ఫోటో షూట్‌ చేసిన పిక్స్ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా పాకాయి. అయితే ఇమ్రాన్ కూడా ఈ పాత్రలలో లీనమై ఫోటో షూట్‌ కి ఫోజులిచ్చాడట. డార్క్ నైట్ యొక్క జోకర్ పాత్రలోకి మారిన ఇమ్మాన్‌ హష్మీ ఫోటోలు నెటిజన్లను ఎంతగానో అలరిస్తున్నాయి. ఇటీవల ఈ హీరో రాజ్ రీ బూట్ అనే హర్రర్ చిత్రంలో కనిపించగా, ఇప్పుడు బాద్‌షాహో, కెప్టెన్ నవాబ్‌ అనే చిత్రాలు చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు 2017లో రిలీజ్ కి రెడీగా ఉన్నాయి.


2010
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles