కారు దిగ‌కుండా హీరోని చుట్టుముట్టిన అభిమానులు

Sun,February 11, 2018 01:30 PM

నేటి యూత్‌లో హీరో, హీరోయిన్‌ల‌పై అభిమానం ఏ రేంజ్‌లో ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. వెండితెర‌పై క‌నిపిస్తేనే వాళ్ళ కాళ్ళు నేల‌పై ఆనవు, అలాంటిది ఎదురుగా క‌నిపిస్తే ఇంకెమ‌న్నా ఉంటుందా, ఒక్క‌సారిగా ఎగ‌బ‌డిపోతారు. ఇలాంటి ఘ‌ట‌నే తాజాగా జరిగింది. ఫ్యాన్స్ అంద‌రు హీరో కారుపై ప‌డిపోయి చివరికి కారు దిగ‌కుండా చేశారు. ఈ సంఘ‌ట‌న తాజాగా హైద‌రాబాద్ టోలిచౌకీలోని ఓ షాపింగ్ మాల్ లో జ‌రిగింది. వివ‌రాల‌లోకి వెళితే టోలిచౌకి (జానకి నగర్‌) పోడియం మాల్‌లో ఓ షోరూం ప్రారంభించేందుకు నిర్వాహ‌కులు కిస్సుల వీరుడు ఇమ్మాన్ హ‌ష్మీని, బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ సైనా నెహ్వ‌ల్ , బాలీవుడ్‌ నటి రియా చక్రవర్తిని ఆహ్వానించారు. అయితే ఇమ్రాన్ వ‌స్తున్నాడ‌నే విష‌యం తెలుసుకున్న అభిమానులు ఆయ‌న కోసం గంట‌ల త‌ర‌బ‌డి అక్క‌డే వెయిట్ చేస్తున్నారు. ఇమ్రాన్ కారు నిన్న రాత్రి 8.30గంటల సమయంలో మాల్‌ ఆవరణలోకి వచ్చింది. ఇక అంతే భారీ సంఖ్య‌లో చేరుకున్న యువ‌కులు కారుపై ప‌డి ఇమ్రాన్‌తో చేయి క‌లిపేందుకు పోటీ ప‌డ్డారు. ఈ ప‌రిస్థితుల‌ల‌లో బౌన్స‌ర్స్ కూడా వారిని అదుపు చేయ‌లేక‌పోయారు. దీంతో అతికష్టం మీద కారును వెనక్కి మళ్లించి , మాల్‌ను ప్రారంభించకుండానే వెనుదిరిగి పోయాడు.

4570
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles