బాబాయి, అబ్బాయిల మ‌ధ్య ఎమోష‌న‌ల్ సీన్స్

Sat,April 14, 2018 08:37 AM
emotional scenes of pawan and charan

మెగాస్టార్ చిరంజీవి వార‌స‌త్వాన్ని పుణికిపుచ్చుకున్న రామ్ చ‌ర‌ణ్ రంగ‌స్థ‌లం చిత్రంతో త‌నలో దాగి ఉన్న పూర్తి న‌ట విశ్వ‌రూపం క‌న‌బ‌ర‌చాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర వ‌సూళ్ళ సునామి సృష్టిస్తూ 200 కోట్ల మార్క్‌ని అందుకునేందుకు ప‌రుగులిడుతుంది. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన రంగ‌స్థ‌లం మూవీ పక్కా గ్రామీణ నేప‌థ్యంలో రూపొంద‌గా, ఈ చిత్రానికి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా ల‌భించాయి. ఈ క్ర‌మంలో రంగ‌స్థ‌లం నిర్మాత‌లు నిన్న సాయంత్రం హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ పోలీస్‌ గ్రౌండ్‌లో రంగ‌స్థ‌లం విజ‌యోత్సవ స‌భ‌ని నిర్వ‌హించారు. ఈ కార్యక్ర‌మానికి ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజ‌ర‌య్యారు. ప‌వ‌న్ స‌భా వేదిక ద‌గ్గ‌ర‌కి రాగానే, వెంట‌నే ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కి వెళ్ళిన చ‌ర‌ణ్ ఆయ‌న బ్లెస్సింగ్ తీసుకున్నాడు . ఆ తర్వాత స్టేజ్‌పై ప‌వన్ మాట్లాడుతూ.. చ‌ర‌ణ్ చిత్రంలో చాలా అద్భుతంగా న‌టించాడు. ఇందులో మ‌నుషుల క‌న్నా పాత్ర‌లే ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి అని అన్నాడు. ఈ మూవీ త‌ప్ప‌క ఆస్కార్‌కి వెళ్ళాల్సిన చిత్రం అని పేర్కొన్నారు. రామ్ చరణ్ ఒక పరిపూర్ణమైన నటుడు... చిట్టిబాబు నాకు తమ్ముడు.. నా అన్నయ్య నాకు తండ్రి.. నా వదిన నాకు అమ్మ.. అంటూ ఎమోష‌న‌ల్‌గా మాట్లాడాడు. చ‌ర‌ణ్ చూసి గ‌ర్వంగా ఫీలై ఆయ‌న‌కు ముద్దు కూడా ఇచ్చాడు ప‌వ‌న్‌. వెంట‌నే చ‌రణ్ కూడా త‌న బాబాయికి ముద్దు ఇచ్చాడు. ఈ స‌న్నివేశం మెగా అభిమానులకి ఎక్క‌డ‌లేని ఆనందాన్ని అందించింది. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.3281
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles