రాజకీయ నేతల బయోపిక్ ల విడుదలపై ఈసీ ఆంక్షలు

Wed,April 10, 2019 04:53 PM
Election Commission orders to Cannot release biopics during polls


న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ‘పీఎం నరేంద్రమోదీ’ బయోపిక్‌ విడుదలను ఆపాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు రాజకీయ నేతల బయోపిక్ ల విడుదలపై ఈసీ ఆంక్షలు విధించింది. బయోపిక్ సినిమాల ప్రదర్శన, వాణిజ్య ప్రకటనలపై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. పత్రికలు, టీవీల్లో ఎలాంటి వాణిజ్య ప్రకటనలు ఉండకూడదని, సినిమా థియేటర్లలో షోలు వేయకూడదని ఈసీ ఆదేశాలు జారీచేసింది. బయోపిక్ సినిమాల వాల్ పోస్టర్లపై ఈసీ నిషేధం విధించింది. బయోపిక్ లపై ఈసీ ఆదేశాల అమలుకు పర్యవేక్షక కమిటీ ఏర్పాటైంది. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో పర్యవేక్షక కమిటీ ఉల్లంఘనలను పరిశీలిస్తుందని, ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని ఈసీ స్పష్టం చేసింది.

1378
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles