ఏక్ బార్ అంటున్న రామ్ చ‌ర‌ణ్‌

Fri,December 28, 2018 08:06 AM

రామ్ చ‌ర‌ణ్, కియారా అద్వానీ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో బోయ‌పాటి శీను తెర‌కెక్కించిన చిత్రం విన‌య విధేయ రామ‌. జ‌న‌వ‌రి 11న విడుద‌ల కానున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ వేడుక నిన్న సాయంత్రం ఘ‌నంగా జ‌రిగింది. కార్య‌క్ర‌మానికి కేటీఆర్ ముఖ్య అతిధిగా హాజ‌ర‌య్యారు. చిరు, కేటీఆర్ చేతుల మీదుగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌ల కాగా, దీనికి భారీ రెస్పాన్స్ వ‌చ్చింది. ఇక దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతంలో రూపొందిన ఏక్ బార్ అనే సాంగ్ వీడియోని కూడా ఈ కార్య‌క్ర‌మంలో విడుద‌ల చేశారు. ఇందులో చెర్రీ స్టెప్పుల‌కి అభిమానులు ఫిదా అయిపోయారు. వివేక్ ఒబేరాయ్‌, ఆర్య‌న్ రాజేష్‌, ప్ర‌శాంత్‌, స్నేహ‌, మ‌ధుమిత‌, హిమ‌జ కీల‌క పాత్ర‌ల‌లో న‌టించారు. డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై డీవీవీ దాన‌య్య నిర్మించిన ఈ చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ ఇషా గుప్తా స్పెష‌ల్ సాంగ్‌తో క‌నువిందు చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే.

2446
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles