ఇంటి స‌భ్యుల త‌ల‌పై కోడిగుడ్లు ప‌గ‌ల‌గొట్టించిన నాని

Sun,September 9, 2018 07:07 AM
eggs break on house mates head

శ‌నివారం వ‌చ్చిందంటే నాని పిట్ట క‌థ‌తో చెప్ప‌డం, ఆ త‌ర్వాత‌ ఇంటి స‌భ్యుల‌కి కొన్ని చుర‌క‌లు పెట్టి ఆ త‌ర్వాత వారితో స‌ర‌దాగా గేమ్ ఆడించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తుంది. ఈ వారం నాని పిట్ట క‌థ‌ని డైరెక్ట్‌గా హౌజ్‌మేట్స్‌తోనే చెప్పారు. నిద్ర పోతూ మేము పోలేద‌ని చెప్పిన నేప‌థ్యంలో నాని ఆ పిట్ట క‌థని చెప్పుకొచ్చారు. ఇక త‌నీష్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా శుక్ర‌వారం రోజు బిగ్ బాస్ ఇంట్లో ఉన్న టీవీలో త‌నీష్ అప్‌క‌మింగ్ మూవీ రంగు ట్రైలర్ ప్ర‌ద‌ర్శిత‌మైంది. ఇది చూసి త‌నీష్ భావోద్వేగానికి గుర‌య్యాడు. ఎప్ప‌టిలాగానే శుక్ర‌వారం నాడు జ‌రిగిన కొన్ని విశేషాల‌ని చూపించారు నాని. ఇందులో కౌశ‌ల్‌.. దీప్తి,శ్యామ‌ల‌కి గీతోప‌దేశం చేశారు. గేమ్ ఆడే ప‌ద్ద‌తి స‌రిగా లేద‌ని చెబుతూ మీరు మిమ్మల్ని కాపాడుకోవ‌డానికే ఆడిన‌ట్టుంది కాని, గెల‌వ‌డానికి ఆడిన‌ట్టు లేద‌ని చెప్పుకొచ్చారు.దీనికి వారు మా వంతు ప్ర‌య‌త్నం చేశామ‌ని అన్నారు.

ఇక ఒక్కో ఇంటి స‌భ్యుడితో మాట్లాడుతున్న క్ర‌మంలో నాని .. దీప్తికి చుర‌క‌లు అంటించారు. ప‌ర్స‌న‌ల్‌గా ఎవ‌రి గురించి మాట్లాడొద్ద‌ని అన్నా కూడా మీరు ఆ ధోర‌ణి మార్చుకోలేద‌ని అన్నారు నాని. కారులో ఉన్న‌ప్పుడు అత‌ని భార్య అతడితో ఎలా ఉండగలుగుతుందో, ఆమె ఓపికకు దండం పెట్టాలంటూ కౌశ‌ల్‌పై దీప్తి చేసిన కామెంట్స్‌పై నాని ఆ విధంగా స్పందించారు. ఇక సంచాల‌కుడిగా ఉన్న కౌశ‌ల్ ముందే రూల్స్ పెట్ట‌డం వ‌ల‌న మిగ‌తావారు కార్న‌ర్ అయి కూర్చున్నారు అని నాని తెలియ‌జేశాడు.నువ్వు వ‌ద్దు అని కొన్ని రూల్స్ ముందే చెప్ప‌డం వ‌లన వారు గేమ్‌ని కంప్లీట్‌గా ఆడ‌లేక‌పోతున్నార‌ని నాని చెప్ప‌డంతో నెక్ట్స్ నుండి అలా జ‌ర‌గ‌కుండా చూసుకుంటాన‌ని కౌశ‌ల్ తెలిపాడు.

ఇక శ‌నివారం రోజు నాని ఇంటి స‌భ్యుల‌కి ‘గుడ్డుకొట్టుకోరా గణేషా’ అనే సరదా టాస్క్ ఇచ్చి ఆడించారు . ఈ టాస్క్ ప్రకారం యాక్టివిటి రూంలో ఉన్న ఒక‌ కంటెస్టెంట్ గురించి నాని ఐదు ప్రశ్నలు అడుగుతారు. యాక్టివిటి రూంలో ఉన్న కంటెస్టెంట్ చెప్పిన స‌మాధానం, లివింగ్ రూంలో ఉన్న మిగిలిన సభ్యులు ఇచ్చే సమధానం మ్యాచ్ కావాలి. అలా కాని పక్షంలో తలపై గుడ్డు పగలకొట్టుకోవాలని టాస్క్ ఇచ్చారు నాని. యాక్టివిటీ రూంలో గుడ్ల తో పాటు ఎస్ ఆర్ నో బోర్డ్‌లు ఉంచారు. తొలుతగా యాక్టివిటీ రూంలోకి వెళ్లిన దీప్తి ఒక్క గుడ్డుకూడా కొట్టుకోకుండా బయటకు వచ్చేసింది. ఆమెకు దీప్తి నామినేషన్స్‌లో లేకపోతే రిలాక్స్ అయిపోతుంది? సేఫ్ గేమ్ ఆడుతుంది? మంచి ఆర్టిస్ట్, ఆమెకు హౌస్‌లో ఉన్నవాళ్లతో గొడవలు లేవు లాంటి ప్రశ్నలు రావడంతో ఆమె అభిప్రాయంతో మిగిలిన కంటెస్టెంట్స్ ఏకీభవించారు. అనంతరం అమిత్, గీతా మాధురి రెండేసి గుడ్లు కొట్టుకోగా.. తనీష్, రోల్ రైడాలు ఒక్కోగుడ్డుతో సరిపెట్టేశారు.

ఇంట్లో లానే ఈ గేమ్‌లో కూడా మిగ‌తా ఇంటి స‌భ్యులు కౌశ‌ల్‌తో ఏకీభ‌వించ‌క‌పోవ‌డంతో ఆయ‌న నాలుగు గుడ్లు త‌ల‌పై కొట్టుకున్నారు. యాంక‌ర్ శ్యామ‌ల కూడా కౌశ‌ల్‌తో స‌మానంగా నాలుగు గుడ్లు త‌ల‌పై ప‌గ‌ల‌గొట్టుకుంది. ఇక ఆ త‌ర్వాత ప్ర‌తి శ‌నివారం ఇంటి స‌భ్యుల‌కి కాల‌ర్‌తో మాట్లాడే అవ‌కాశం బిగ్ బాస్ క‌ల్పించ‌గా, ఈ వారం కాల‌ర్ గీతా మాధురితో మాట్లాడింది. గొడ‌వ‌లు పక్క‌న పెట్టి గేమ్ పై కాన్స‌న్‌ట్రేష‌న్ చేయ‌మ‌ని సూచ‌న‌లిచ్చింది. నందుని అడిగాన‌ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పోస్ట్ పెట్ట‌మ‌ని ల‌క్ష్మీని కోరింది గీతా.ఇక గ‌త సీజ‌న్‌లో విజేత‌గా అమ్మాయిలు నిలుస్తారని భావించిన అది కుద‌ర‌లేదు. అందుకే ఈ సారి ఉమెన్‌ని రిప్ర‌జెంట్ చేస్తూ బిగ్ బాస్ సీజ‌న్ 2 విజేత అమ్మాయే కావాల‌ని హైద‌రాబాద్ కాల‌ర్ ల‌క్ష్మీ కోరింది. ఇక గ‌త వారం హౌజ్ నుండి ఇద్ద‌రు ఎలిమినేట్ కాగా, ఈ శ‌నివారం కూడా ఎలిమినేష‌న్ ఉంటుంద‌ని అంద‌రు భావించారు. కాని ఈ వారం ఒక్కరు మాత్ర‌మే ఎలిమినేట్ కానున్నారు.

అయితే ఈవారం ఎలిమినేషన్‌లో ఉన్న దీప్తి, కౌశల్, అమిత్, శ్యామలలో ఎవరు సేఫ్ అయ్యారనే విష‌యాన్ని శ‌నివారం రివీల్ చేసే నాని దీన్ని ఆదివారం ఎపిసోడ్‌కి వాయిదా వేశారు. దీంతో ఎవ‌రు ఎలిమినేట్ అయ్యారు, ఎవ‌రు సేఫ్ అయ్యార‌నే విష‌యంలో కాస్త స‌స్పెన్స్ నెల‌కొంది.

5419
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles