తెలుగ‌మ్మాయితో కూలెస్ట్ పీపుల్‌

Wed,September 19, 2018 12:23 PM
eesha rebba with collest people

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న చిత్రం అర‌వింద స‌మేత‌..వీర రాఘ‌వ‌. రాయ‌లసీమ బ్యాక్ డ్రాప్‌లో ఈ మూవీ తెర‌కెక్కుతుందని తెలుస్తుండ‌గా, ఇందులో క‌థానాయిక‌గా పూజా హెగ్డే న‌టిస్తుంది. అరవింద సమేత’ చిత్రంలో ఎన్టీఆర్ రెండు విభిన్న పాత్రలలో కనిపించనున్నాడని జోరుగా ప్రచారం జరుగుతుంది. ప్రధమార్ధంలో సిద్ధార్ధ్ గౌతమ్ పాత్రలో కనిపించనున్న ఎన్టీఆర్ ద్వితీయార్ధంలో వీర రాఘవగా కనిపించి అలరించనున్నాడు.అయితే ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర కోసం తెలుగు అమ్మాయి అయిన ఈషా రెబ్బ‌ని సెల‌క్ట్ చేసిన‌ట్టు అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. కాని దీనిపై క్లారిటీ లేదు. తాజాగా ఈషా.. ఎన్టీఆర్, త్రివిక్ర‌మ్‌తో క‌లిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. కూలెస్ట్ పీపుల్‌తో అనే కామెంట్ పెట్టింది.

అమీ తుమీతో, అ చిత్రంతో పాటు ఇటీవ‌ల విడుద‌లైన బ్రాండ్ బాబు చిత్రంలోను ఈషా ప‌ర్‌ఫార్మెన్స్ త్రివిక్ర‌మ్‌కి న‌చ్చ‌డంతో ఓ పాత్ర‌కోసం ఈ తెలుగమ్మాయిని సెల‌క్ట్ చేసిన‌ట్టు తెలుస్తుంది. ఇందులో ఈషా పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుంద‌ని, ఇంత‌క ముందు సినిమాల క‌న్నా ఈ సినిమాలో ఈషా ప‌ర్‌ఫార్మెన్స్ కొత్త కోణంలో క‌నిపిస్తుంద‌ని స‌న్నిహితులు అంటున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. చిత్రంలో అమితాబ్ బచ్చ‌న్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తున్నాడ‌ని అంటున్నారు. రేపు చిత్ర ఆడియో కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుండ‌గా, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిధిగా హాజ‌రు కానున్నార‌ని చెబుతున్నారు.1709
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS