త‌న క‌ల‌ర్‌పై కామెంట్ చేసిన వారికి దిమ్మ తిరిగే స‌మాధానం

Thu,October 25, 2018 08:56 AM
eesha rebba gives punch to netigen

దర్శకుడు సినిమాతో హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది టాలీవుడ్ నటి ఈషా రెబ్బా. ‘అంతకు ముందు ఆ తర్వాత’తో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన ఈ తెలుగమ్మాయి ఇటీవ‌ల‌ ‘అ’ చిత్రంలోను కనిపించింది . తాజాగా ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన‌ అరవింద సమేత చిత్రంలో కీలక పాత్ర పోషించింది .ఎన్టీఆర్ చెల్లెలిగా వైవిధ్య‌మైన న‌ట‌న క‌న‌బ‌రిచి విమ‌ర్శ‌కుల‌ ప్ర‌శంస‌లు అందుకుంది. అయితే ఈ అమ్మ‌డిని ఓ నెటిజన్ ‘ఈషాగారు మీరు కొంచెం కలర్‌ ఉంటే మీకు తిరుగే ఉండేది కాదు’ అని కామెంట్‌ చేశారు. దీనికి ఈషా.. ‘ఎందుకు అండి ఈ కలర్ పిచ్చి. నాకు ఉన్న కలర్ తో నేను చాలా సంతోషంగా ఉన్నాను. హీరోలు ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ హీరోయిన్ మాత్రం తెల్లగా మన నేటివిటీకి సంబంధం లేకుండా ఉంటే మీకు ఇష్టమా???’ అని స‌మాధానం ఇచ్చి అత‌ని నోరు మూయించింది. ఈషాకి తెలుగులోనే కాదు వేరే భాష‌ల‌లోను ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. క‌న్న‌డ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ చిత్రంలో ఈషా రెబ్బా కాలేజీ లెక్చరర్ పాత్రలో కనిపించనుందట. ఈ సినిమాకు లక్కీ గోపాల్ దర్శకుడు. కిరిక్ పార్టీ (కన్నడ)కి మ్యూజిక్ అందించిన అజనీష్ బీ లోక్‌నాథ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించనున్నాడు.3619
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles