ప్రమోషన్ స్పీడ్ పెంచిన అవసరాల

Sat,April 1, 2017 10:36 AM
Ee Pilla Aa Pilla Promo Song

ఒకవైపు దర్శకుడిగా రాణిస్తూనే మరోవైపు నటుడిగా వరుస సినిమాలు చేస్తున్నాడు అవసరాల శ్రీనివాస్. ప్రస్తుతం బాలీవుడ్ మూవీ రీమేక్ లో నటిస్తున్నాడు అవసరాల. నూతన దర్శకుడు నవీన్ మేడారం దర్శకత్వంలో రూపొందిన అడల్ట్ కామెడీ చిత్రంలో అవసరాల లీడ్ రోల్ పోషించగా ఆయన సరసన తేజస్వి మదివాడ, మిస్తీ చక్రవర్తి, శ్రీముఖి,సుప్రియ లు హీరోయిన్లుగా నటించారు. తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళీ లు కీలక పాత్రలు పోషించారు. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. అయితే హంటర్ రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి ‘బాబు బాగా బిజీ’ అనే టైటిల్ ఫిక్స్ చేసింది టీం. ఇటీవల విడుదలైన చిత్ర టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఏప్రిల్ లో మూవీని రిలీజ్ చేయాలని భావించిన టీం సాంగ్స్, ప్రోమోస్ అంటూ సినిమాను వెరైటీగా ప్రమోట్ చేసుకుంటుంది. తాజాగా ఈ పిల్ల ఆ పిల్ల అనే ప్రోమో సాంగ్ ని విడుదల చేసింది టీం. ఆ సాంగ్ పై మీరు ఓ లుక్కేయండి.

1044
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles