వ‌ర్మ చిత్రంలో ర‌జ‌నీకాంత్ భార్య ..!

Tue,June 12, 2018 11:31 AM
Easwari Rao On Board For Balas Varma movie

చియాన్ విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్ హీరోగా అర్జున్ రెడ్డి త‌మిళ రీమేక్ .. వ‌ర్మ టైటిల్‌తో రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. బోల్డ్ కంటెంట్ తో సహజత్వ ప్రేమకథగా త‌మిళంలో రూపొందుతున్న ఈ సినిమాని బాల తెర‌కెక్కిస్తున్నాడు. నేష‌న‌ల్ అవార్డు విన్న‌ర్ రాజు మురుగున్ చిత్రానికి డైలాగ్స్ రాస్తున్నాడు. చిత్రంలో క‌థానాయిక ఎవ‌ర‌నే దానిపై ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ లేదు. తెలుగులో అర్జున్ రెడ్డి చిత్రం భారీ విజ‌యం సాధించ‌డంతో త‌మిళంలోను ఈ మూవీపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. రీసెంట్‌గా అర్జున్ రెడ్డి గెట‌ప్‌లో ధృవ్ లుక్ ఒక‌టి బ‌య‌ట‌కి రాగా, ఇది అభిమానుల‌ని ఎంత‌గానో అల‌రించింది. ఇక ఈ చిత్రంలో ముఖ్య పాత్ర కోసం ఈశ్వ‌రీరావుని ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తుంది.

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన తాజా చిత్రం కాలా. ఇందులో త‌లైవా భార్య పాత్ర‌లో న‌టించి మెప్పించింది ఈశ్వరీ. ఇప్పుడు ఈమెకి కోలీవుడ్‌లో రెండో సినిమా ఓకే అయిన‌ట్టు తెలుస్తుంది. వ‌ర్మ చిత్రంలో ముఖ్య పాత్రకి ఈశ్వరీరావుని బాల ఎంపిక చేశాడ‌ట . త్వ‌ర‌లోనే ఈమెపై కొన్ని సీన్స్ తెర‌కెక్కించ‌నున్నాడ‌ని తెలుస్తుంది. వ‌ర్మ చిత్రం త‌ర్వాత ఈశ్వ‌రీరావుకి మరిన్ని ఆఫర్స్ రావ‌డం పక్కా అని కోలీవుడ్ చెబుతుంది.

3428
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS