ఇప్పుడు బెంగ‌ళూర్ లో డీజే ప్ర‌మోష‌న్స్

Thu,June 22, 2017 12:26 PM
duvvada jagannadham promotions start at bangaluru

హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శక‌త్వంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన చిత్రం దువ్వాడ జ‌గ‌న్నాధం. ఈ మూవీ రేపు ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. స‌రైనోడు వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని అందుకున్న బ‌న్నీ, ఈ సినిమాతో త‌న రేంజ్ మ‌రింత పెంచుకోవాల‌ని భావిస్తున్నాడు. కొన్ని రోజులుగా అల్లు అర్జున్, పూజా హెగ్డే తెలుగు ఛానెల్స్ కి ఇంట‌ర్వ్యూలు ఇస్తూ మూవీకి భారీ ప్ర‌మోష‌న్స్ చేసుకున్నారు. ఇక స్టైలిష్ స్టార్ కి మ‌ల‌యాళంలోను మంచి క్రేజ్ నెల‌కొన్న నేప‌థ్యంలో తాజాగా బెంగ‌ళూర్ కి వెళ్ళారు. అక్క‌డి మీడియాకి కూడా ఇంట‌ర్వ్యూలు ఇస్తూ సినిమాకి సంబంధించిన‌ ఆస‌క్తిర విష‌యాలు వెల్లడిస్తున్నారు. తొలిసారి బన్నీ బ్రాహ్మ‌ణ గెట‌ప్ పాత్ర పోషించే స‌రికి డీజే సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. దేవి శ్రీ అందించిన సంగీతానికి కూడా మంచి రెస్పాన్స్ రావ‌డంతో డీజే బాక్సాఫీస్ బ‌ద్ద‌లు కొట్ట‌డం ఖాయ‌మ‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు.


1189
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles