షూటింగ్ పూర్తి .. జూన్ 23 విడుద‌ల‌

Tue,June 13, 2017 03:28 PM
duvvada jagannadham movie shooting completed

కొద్ది రోజుల నుండి దువ్వాడ జ‌గ‌న్నాధ‌మ్ చిత్రాని కి సంబంధించిన వార్త‌లు సినీ ల‌వ‌ర్స్ కి మంచి జోష్ ని అందిస్తున్నాయి. హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ ప్ర‌ధాన పాత్ర‌లో ఈ చిత్రం రూపొందగా ,నేటితో షూటింగ్ పూర్తి అయిన‌ట్టు ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశాడు. త‌న‌కి స‌పోర్ట్ చేసిన అల్లు అర్జున్, దిల్ రాజుల‌కి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌తలు తెలియ‌జేశాడు హ‌రీష్‌. ఇటీవ‌ల దువ్వాడ జ‌గ‌న్నాధ‌మ్ చిత్ర పాట‌లు విడుద‌ల కాగా, ఇవి సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో అల‌రిస్తున్నాయి. దేవి శ్రీ సంగీతం, పూజా హెగ్డే గ్లామ‌ర్, బ‌న్నీ మేన‌రిజం, హ‌రీష్ శంక‌ర్ టేకింగ్ సినిమాని ఓ రేంజ్ కి తీసుకెళ్ళ‌డం ఖాయం అని ఫ్యాన్స్ అంటున్నారు. జూన్ 23న ఈ చిత్రం విడుద‌ల కానుండ‌గా, ఇప్పటి నుండే అభిమానులు టిక్కెట్స్ కోసం ప‌లు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అల్లు అర్జున్ త్వ‌ర‌లో వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నుండ‌గా, ఈ చిత్రం రేపు లాంచ్ కానున్న సంగ‌తి తెలిసిందే.


1156
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles