డీజే ఆడియో సాంగ్స్ విడుద‌ల‌

Sun,June 11, 2017 10:27 AM
Duvvada Jagannadham Full Songs released

సరైనోడు చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని అందుకున్న అల్లు అర్జున్ ప్ర‌స్తుతం హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ అనే చిత్రాన్ని చేస్తున్న సంగ‌తి తెలిసిందే. నిన్న సాయంత్రం ఆడియో ట్రాక్ లిస్ట్ రిలీజ్ చేసిన యూనిట్ తాజాగా చిత్రానికి సంబంధించిన అన్ని సాంగ్స్ నెట్ లో విడుద‌ల చేశారు. దేవి శ్రీ అందించిన సంగీతం మ్యూజిక్ ల‌వ‌ర్స్ ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. ఇక సినిమాపై భారీ అంచ‌నాలు పెంచేందుకు సాయంత్రం ప్రీ రిలీజ్ వేడుక‌ని అంగ‌రంగ వైభ‌వంగా జ‌ర‌పాల‌ని ప్లాన్ చేస్తుంది . మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా ఈ ఈవెంట్ జ‌ర‌గ‌నున్న‌ట్టు స‌మాచారం. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, గ్లామ‌ర్ బ్యూటీ పూజా హెగ్డేల రొమాన్స్ ఆడియ‌న్స్ కి మంచి కిక్ ఇస్తుంద‌ని అంటున్నారు. దువ్వాడ జ‌గ‌న్నాథం చిత్రం దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న25వ చిత్రం కాగా, ఈమూవీని జూన్ 23న విడుద‌ల చేస్తున్నారు.

8179
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles