ఈ వార్త బ‌న్నీ అభిమానుల‌ను నిరాశ‌ప‌రచొచ్చు..!

Tue,June 20, 2017 01:23 PM
duvvada jagannadham benfit shows cancelled

స‌రైనోడు వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ అనే చిత్రాన్ని చేశాడు. ఈ మూవీని జూన్ 23న విడుద‌ల చేస్తున్నారు. ఇప్ప‌టికే సినిమాకి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న్స్ చేస్తున్నారు మూవీ మేక‌ర్స్. అయితే ఈ మూవీ కోసం బ‌న్నీ ఫ్యాన్స్ ఎంతో ఆశ‌గా ఎదురు చూస్తుండ‌గా, డై హార్డ్ కోర్ ఫ్యాన్స్ మాత్రం బెనిఫిట్ షో ఉంటుందేమోన‌ని భావించారు. కాని వారి ఆశ‌ల‌కు గండి ప‌డింది. బెనిఫిట్ షో వ‌ల‌న చిత్రంపై నెగెటివ్ ఇంపాక్ట్ ప‌డుతుందేమోన‌ని భావించిన నిర్మాత‌లు దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ చిత్ర బెనిఫిట్ షోని క్యాన్సిల్ చేసిన‌ట్టు తెలుస్తుంది. గ‌త కొద్ది రోజులుగా కొంత మంది హీరోలు ఈ సంప్ర‌దాయాన్ని చాలా దూరం పెట్టారు. దీని వ‌ల‌న చిత్ర ఓపెనింగ్ పై ఎఫెక్ట్ ప‌డుతుంద‌ని వారు అనుకుంటున్నారు. ఇందుకు ఉదాహ‌ర‌ణ చ‌ర‌ణ్ న‌టించిన బ్రూస్ లీ మూవీ అని చెప్ప‌వ‌చ్చు. స‌రైనోడు మూవీకి బెనిఫిట్ షో అవ‌కాశం క‌ల్పించ‌ని బ‌న్నీ దువ్వాడ జ‌గ‌న్నాథం చిత్రంకి కూడా బెనిఫిట్ షో ర‌ద్దు చేయ‌డంకొంత బాధాక‌ర‌మైన విష‌య‌మే అని అంటున్నారు ఫ్యాన్స్.

2829
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles