డీజే ఆడియో వేడుక‌పై అఫీషియ‌ల్ ఎనౌన్స్ మెంట్

Fri,June 9, 2017 12:13 PM
DUVVADA JAGANNADHAM  audi date confirmed

ఇటీవ‌ల ప్రోమో సాంగ్స్ తో సంద‌డి చేసిన దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ ఆడియో వేడుకకి డేట్ ఫిక్స్ చేశాడు. కొద్ది రోజుల నుండి ఆడియో రిలీజ్ డేట్ పై అభిమానుల‌లో సందిగ్ధం నెల‌కొన‌గా, తాజాగా పోస్ట‌ర్ తో క్లారిటీ ఇచ్చారు మూవీ మేక‌ర్స్. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన టీజ‌ర్, ట్రైల‌ర్, ప్రోమో సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ రావ‌డంతో సినిమాపై కూడా భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. దేవి శ్రీ ప్ర‌సాద్ ఎప్ప‌టిలాగానే త‌న దైన స్టైల్ లో మంచి మ్యూజిక్ అందించాడు. ఆడియో రిలీజ్ ఈవెంట్ ని హైద‌రాబాద్ లోని శిల్ప కళా వేదిక‌లో జూన్ 11న‌ జ‌ర‌ప‌నున్న‌ట్టు స‌మాచారం. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, గ్లామ‌ర్ బ్యూటీ పూజా హెగ్డేల రొమాన్స్ ఆడియ‌న్స్ కి మంచి కిక్ ఇస్తుంద‌ని అంటున్నారు. దువ్వాడ జ‌గ‌న్నాథం చిత్రం దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న25వ చిత్రం కాగా, ఈ చిత్ర ఆడియో వేడుక‌ని గ్రాండ్ గా నిర్వ‌హించాల‌ని భావిస్తున్నారు. జూన్ 23న విడుద‌ల కానున్న ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ కూడా బాగానే చేస్తున్నారు.

992
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles