దీపికా పదుకొనే పాత్ర 10 నిమిషాలేనట..!

Fri,June 14, 2019 07:24 PM
duration of Deepika padukone role revealed in 83 movie

లెజెండరీ ఇండియా క్రికెటర్ కపిల్‌దేవ్ జీవితం ఆధారంగా ‘83’ బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కబీర్ ఖాన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. రణ్‌వీర్‌సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ ప్రాజెక్టులో బాలీవుడ్ నటి దీపికాపదుకొనే కీలక పాత్రలో మెరువనుంది. రియల్‌లైఫ్ మాదిరిగానే రీల్‌లైఫ్‌లో రణ్‌వీర్‌సింగ్ భార్యగా దీపికాపదుకొనే కనిపించనుంది.

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అప్‌డేట్ ఒకటి బాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో దీపికా పాత్ర నిడివి కేవలం 10 నుంచి 12 నిమిషాలు మాత్రమే ఉంటుందట. దీపికాపదుకొనే త్వరలోనే లండన్‌లో జరిగే షూటింగ్‌లో జాయిన్ కానుంది. సాకిబ్ సలీం 83 ప్రాజెక్టులో కీలక పాత్రలో నటిస్తున్నాడు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రథమార్థంలో ప్రేక్షకుల ముందుకురానుంది.

2325
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles