విలన్ గా దుల్కర్ సల్మాన్ ?

Thu,November 15, 2018 10:25 PM
Dulquer Salmaan to turn as villian for kamalhasan

ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్. ఇప్పటివరకు హీరోగా కనిపించిన ఈ యంగ్ హీరో ఇపుడు విలన్ గా కనిపించేందుకు రెడీ అవుతున్నట్లు కోలీవుడ్ వర్గాలు వెల్లడించాయి.

కమల్‌హాసన్ కథానాయకుడిగా నటించనున్న తాజా చిత్రం భారతీయుడు-2. సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న భారతీయుడు చిత్రానికి సీక్వెల్ ఇది. శంకర్ దర్శకుడు. ఇటీవలే సెట్ నిర్మాణంతో ఈ సినిమాకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం పూర్వనిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. డిసెంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానున్నట్లు సమాచారం. ఇదిలావుండగా ఈ సినిమాలో మలయాళ యువ హీరో దుల్కర్ సల్మాన్ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలిసింది. ప్రతినాయక ఛాయలతో ఆయన పాత్ర సాగుతుందని సమాచారం. ఈ సినిమాలో నయనతార, కాజల్‌అగర్వాల్ కథానాయికలుగా నటించనున్నట్లు తెలుస్తున్నది. భారీ వ్యయంతో లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది.

2082
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles