ఇండియ‌న్ 2లో యంగ్ హీరో..!

Sun,November 11, 2018 07:39 AM
dulquer salmaan plays key role in indian 2

ద‌ర్శ‌క దిగ్గ‌జం శంక‌ర్, లోకనాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన సూప‌ర్ హిట్ చిత్రం భారతీయుడు. లంచం తీసుకున్న‌వాడు సొంత వాడైన స‌రే శిక్షించాల్సిందే అన్న కాన్సెప్ట్‌తో 22 ఏళ్ళ క్రితం వ‌చ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ప్ర‌భంజ‌నం సృష్టించింది. భారతీయుడు గెటప్‌లో కమల్ లంచం తీసుకునే అవినీతి పరుల పని పట్ట‌డం సినిమాకే హైలైట్‌గా నిలిచింది. అప్పట్లో ఈ చిత్రం రికార్డు స్థాయి కలెక్షన్లను రాబట్టడమే కాదు, పలు అవార్డులను కూడా అందుకుంది. కాగా ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌గా 'భారతీయుడు 2'ను శంకర్ తెరకెక్కించనున్నారు. రూ.180 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించనున్నట్టు తెలిసింది. మొదటి పార్ట్‌లోలాగానే ఇందులో కూడా అవినీతి నిర్మూలన అనే కథాంశంతో సినిమా సాగుతుందని సమాచారం. ఈ క్రమంలోనే సినిమాను తెలుగు, తమిళం, హిందీతోపాటు పలు ఇతర భారతీయ భాషల్లోనూ ఏక కాలంలో తీయాలని భావిస్తున్న‌ట్టు స‌మాచారం.

అతి త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ళ‌నున్న ఈ చిత్రానికి ‘2.0’కి ఓ రచయితగా వ్యవహరించిన జయమోహన్ రైటర్‌గా చేయనున్నారట. క‌థానాయిక‌లుగా న‌య‌న‌తార‌, కాజ‌ల్‌ని తీసుకోవాల‌ని అనుకుంటున్నార‌ట‌. ఇక ఈ చిత్రంలో ముఖ్య పాత్ర కోసం యంగ్ హీరో దుల్క‌ర్ స‌ల్మాన్‌ని ఎంపిక చేశార‌ని, ఆయ‌న స‌ర‌స‌న కాజ‌ల్ న‌టించ‌నుంద‌ని అంటున్నారు. శంకర్ ప్రస్తుతం ‘2.0’ చిత్ర ప్ర‌మోష‌న్స్‌లో బిజీగా ఉండ‌గా, ఈ మూవీ విడుదల తరువాత భారతీయుడు 2 చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మించనున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ యూఎస్ లో జరిగే అవకాశాలు వున్నాయి.

2440
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles