రామ్‌తో దుల్క‌ర్ స‌ల్మాన్ మ‌ల్టీ స్టార‌ర్

Fri,September 14, 2018 11:59 AM
Dulquer Salmaan multi starrer with ram

టాలీవుడ్‌లో మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాలకి మ‌రింత‌ ఆద‌ర‌ణ పెరుగుతుండ‌డంతో సీనియ‌ర్ హీరోలు, కుర్ర హీరోలు మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాలు చేసేందుకు ఎక్కువ ఆస‌క్తి చూపుతున్నారు. ఈ క్ర‌మంలో ప‌లు క్రేజీ మ‌ల్టీ స్టార‌ర్ చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయి. త్వ‌ర‌లో మ‌రో మ‌ల్టీ స్టార‌ర్ తెర‌కెక్క‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఎన‌ర్జిటిక్ హీరో రామ్ ఓ త‌మిళ స్టార్ హీరోతో క‌లిసి మ‌ల్టీ స్టారర్ సినిమాని చేయాల‌ని భావిస్తున్నాడ‌ని, ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించి ప్ర‌స్తుతం స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుండ‌గా, రామ్ పెద్దనాన్న స్రవంతి రవి కిషోరే ఈ చిత్రాన్ని నిర్మించ బోతున్నారని అన్నారు.

తాజా స‌మాచారం ప్ర‌కారం మ‌హాన‌టి సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కి ద‌గ్గ‌రైన దుల్క‌ర్ స‌ల్మాన్ ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబినేష‌న్‌లో మ‌ల్టీ స్టార‌ర్ రూపొంద‌నుంద‌ని తెలుస్తుంది. ఈ చిత్రాన్ని ఆర్ ఎక్స్ 100 ఫేం అజ‌య్ భూప‌తి తెర‌కెక్కించ‌నున్నాడ‌ట‌. త్వ‌ర‌లోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి పూర్తి వివ‌రాలు వెల్ల‌డించ‌నున్నారు. రామ్ ప్ర‌స్తుతం నేను లోక‌ల్ ఫేం త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో హ‌లో గురు ప్రేమ కోస‌మే అనే చిత్రాన్ని చేస్తున్నాడు. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ చిత్రంలో క‌థానాయిక‌గా న‌టిస్తుంది. శర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 18న విడుద‌ల కానుంది. శ్రీ వెంక‌టేశ్వ‌ర బేన‌ర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నాడు. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతున్న ‘హలో గురు ప్రేమ కోసమే’ లో కామెడీ హైలెట్ అవ్వనుందట.

1747
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles