మ‌హాన‌టిపై ప్ర‌శంస‌లు.. ర‌కుల్‌కి చీవాట్లు

Wed,May 30, 2018 09:26 AM
Dulquer Salmaan fans fire on Rakul Preet over her post about Mahanati

లెజండ‌రీ యాక్ట్రెస్ సావిత్రి జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన మ‌హాన‌టి చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర నాన్‌స్టాప్ క‌లెక్ష‌న్స్‌తో దూసుకెళుతుంది.ఓవ‌ర్సీస్‌లోను ఈ మూవీకి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. మే 9న విడుద‌లైన ఈ చిత్రంపై ప్ర‌శంస‌లు వ‌ర్షం కూడా కురుస్తూనే ఉంది. రీసెంట్‌గా మ‌హాన‌టి చిత్రం చూసిన ర‌కుల్ ప్రీత్ సింగ్ మ‌హాన‌టి చిత్రాన్ని ఆకాశానికి ఎత్తేసింది. మాస్ట‌ర్ పీస్ అంటూ వ‌ర్ణించింది. ఇక చిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన కీర్తి సురేష్‌, స‌మంత అక్కినేని, విజ‌య్ దేవ‌ర‌కొండల ప‌ర్‌ఫార్మెన్స్‌పై ప్ర‌శంస‌లు కురిపించింది. అయితే సావిత్రి భ‌ర్త జెమినీ గ‌ణేష‌న్ పాత్ర పోషించిన దుల్క‌ర్ స‌ల్మాన్ పేరుని ఇందులో జ‌త చేయ‌క‌పోవ‌డంతో దుల్క‌ర్ స‌ల్మాన్ ఫ్యాన్స్ ర‌కుల్‌పై మండిప‌డుతున్నారు. జెమినీ గ‌ణేష‌న్ పాత్ర‌లో ఒదిగి ఎంతో అద్భుతంగా న‌టించిన ఆయ‌న‌ని ఎలా మ‌రిచిపొయావు అంటూ దుల్క‌ర్ అభిమానులు ఆమె పోస్ట్‌కి కామెంట్స్ పెడుతున్నారు. ప్ర‌స్తుతం సూర్య హీరోగా తెర‌కెక్కుతున్న ఎన్‌జీకే చిత్రంతో పాటు కార్తీ 17వ చిత్రంలోను క‌థానాయిక‌గా న‌టిస్తుంది ర‌కుల్‌. అజయ్ దేవ్‌గ‌ణ్ చిత్రంలోను ర‌కుల్ ప్రధాన పాత్ర పోషిస్తుంది.


6680
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles