డబ్బింగ్ మొదలు పెట్టిన సూర్య

Tue,November 7, 2017 10:00 AM
dubbing starts for suriya movie

తమిళ స్టార్ హీరో సూర్య సింగం 3 తర్వాత విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తానా సెరిందా కూట్టం అనే చిత్రాన్ని చేస్తున్నాడు. యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుంది. ఇందులో రమ్యకృష్ణ, సెంధిల్ ముఖ్య పాత్రలు పోషించగా స్టూడియో గ్రీన్ బేనర్ పై సత్యన్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. ప్రస్తుతం ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. సూర్య తన డబ్బింగ్ సగం పూర్తి చేశాడని చిత్ర దర్శకుడు విఘ్నేష్ శివన్ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. యంగ్ టాలెంట్ అనిరుధ్ రవిచంద్రన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేవాలని టీం భావిస్తుంది.


1054
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles