డబ్బింగ్ సినిమాల విడుదలకు దారేది..?

Tue,November 15, 2016 12:14 PM
dubbing movies in critical situation

పెద్ద నోట్ల రద్దుతో అన్ని పరిశ్రమలతో పాటు సినీ పరిశ్రమకు కూడా పెద్ద దెబ్బే పడింది. ఇప్పటికే కొన్ని సినిమా షూటింగ్‌లు రద్దు కాగా, రిలీజ్ కావలసిన సినిమాల దారెటో అర్దం కాకుండా పోయింది. అల్లరి నరేష్ నటించిన ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం గత వారం విడుదల కావలసి ఉండగా, నోట్ల రద్దుతో నిర్మాతలు చిత్ర రిలీజ్ డేట్‌ని త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. మరి కొన్ని చిత్రాలు ఇదే బాట పట్టనున్నట్టు తెలుస్తోంది. తమిళ చిత్రాలకు అనువాదంగా వస్తోన్న బేతాళుడు, ఒక్కడొచ్చాడు చిత్రాలను ఈ వారంలో విడుదల చేయాలని నిర్మాతలు భావించారు. కాని ఇవి కూడా కొన్ని రోజుల తర్వాతే విడుదల కానున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఇక జీవా, కాజల్ నటించిన కావలై వేండమ్ చిత్రం తెలుగులో ఎంతవరకు ఈ ప్రేమ టైటిల్‌తో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని నవంబర్ 24న విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. మరి ఈ చిత్రం పక్కాగా చెప్పిన డేట్‌కి విడుదల అవుతుందా లేదా దానిపై అభిమానులలో సందిగ్థం నెలకొంది.

1465
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles