54 కేజీల దంగ‌ల్ కేక్ చూశారా..!

Thu,August 10, 2017 05:10 PM
Dubai based bakery shop prepared dangal cake

రెజ్ల‌ర్ మ‌హావీర్ ఫోగట్‌, ఆయ‌న ఇద్ద‌రు కూతుళ్ల నిజ జీవితం ఆధారంగా తెరెకెక్కిన చిత్రం దంగ‌ల్. ఈ మూవీ ఎంద‌రికో ఆద‌ర్శ‌వంతంగా నిలిచింది. ఇక ఈ సినిమా రికార్డుల గురించి అయితే ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఇండియాలోనే కాదు చైనాలోను వ‌సూళ్ళ సునామి సృష్టించింది. అయితే దుబాయ్ కి చెందిన ఓ బేక‌రీ షాప్ యాజమాన్యం 71వ స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా 54వ కేజీల కేక్ ని ఇండియ‌న్స్ కి ట్రిబ్యూట్ గా ఇచ్చింది. ఈ కేక్ త‌యారీ కొన్ని గంట‌ల పాటు సాగ‌గా 1200 మంది దీని కోసం వ‌ర్క్ చేశారు. కేక్ త‌యారీకి 25 ల‌క్ష‌లు ఖ‌ర్చు అయిన‌ట్టు తెలుస్తుంది. ఇక కేక్ పై అమీర్ ఖాన్ తో పాటు, ఇద్ద‌రు కూతుళ్ళు, మిగ‌తా ఆర్ట్ వ‌ర్క్ ప్ర‌తి ఒక్క‌రిని ఎంత‌గానో అల‌రిస్తుంది. ఇక్కడ మ‌రో విశేష‌మేమంటే నేష‌న‌ల్ ఫ్లాగ్ కి ఇరు వైపులా త‌యారీదారులు 75 గ్రాముల ఎడిబుల్ గోల్డ్ (తినదగిన బంగారం) ని ఉప‌యోగించారు. మ‌రి అంత అద్భుతంగా త‌యారైన‌ ఈ కేక్ మేకింగ్ పై మీరు ఓ లుక్కేయండి.

1890
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles