డబ్బింగ్ మొదలు పెట్టిన చిరు చిన్న అల్లుడు

Thu,May 17, 2018 03:52 PM
dub works started for kalyan movie

మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు, శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ ప్రధాన పాత్రలో చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. జనవరి 31న పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్ర షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. సింగిల్ షెడ్యూల్ మాత్రమే పెండింగ్ ఉందని సమాచారం. అయితే ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ పనులు మొదలు కాగా, చిరు అల్లుడు కళ్యాణ్ దేవ్ తన పాత్రకి డబ్బింగ్ చెప్పుకుంటున్నాడు. కళ్యాణ్ దేవ్ డబ్బింగ్ చెబుతున్న ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

కళ్యాణ్ దేవ్ డెబ్యూ మూవీకి సంబంధించి త్వరలోనే ఫస్ట్ లుక్ విడుదల కానుంది. ఎవడే సుబ్రహ్మణ్యం’- ‘కళ్యాణ వైభోగమే’ ఫేం మాళవికా నాయర్ హీరోయిన్ గా నటిస్తోంది. కాలేజ్ నేపథ్యంలో కొనసాగే ప్రేమ కథాంశంగా ఈ సినిమాని రాకేశ్ శశి తెరకెక్కిస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ ‘వారాహి’ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. "బాహుబలి" చిత్రానికి తన కెమెరా వర్క్ తో జీవం పోసిన సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి కెమెరా బాధ్యతలు నిర్వర్తింస్తుండగా.. "రంగస్థలం" చిత్రంతో కళా దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రామకృష్ణ ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు.

తనికెళ్ళభరణి, మురళీ శర్మ, నాజర్, సత్యం రాజేష్, ప్రగతి, కళ్యాణి నటరాజన్, పోసాని కృష్ణమురళి, రాజీవ్ కనకాల, జయప్రకాష్ (తమిళ నటుడు), ఆదర్ష్ బాలకృష్ణ, నోయల్, కిరీటి, భద్రమ్ తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్నారు. హర్షవర్థన్ రామేశ్వర్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

2829
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles