ఆర్ యూ రెడీ: డీఎస్పీ అనే నేను యూఎస్ వ‌స్తున్నాను

Sun,July 8, 2018 08:02 AM
dsp concert video released

రాక్ స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ స్టేజ్ షో ప‌ర్‌ఫార్మెన్స్ ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఆడియో ఫంక్ష‌న్స్‌లోనే దుమ్ము దులిపే దేవి ఇక విదేశాల‌లో ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇస్తే ఏ రేంజ్‌లో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. దేవి ప్ర‌తి ఏడాది విదేశాల‌లో ప‌లు ప్ర‌ద‌ర్శ‌న‌లు నిర్వ‌హిస్తుంటార‌నే సంగ‌తి తెలిసిందే. ఆయ‌న నిర్వ‌హించే కన్స‌ర్ట్స్‌కి ఎంతో మంది సంగీత ప్రియులు త‌ర‌లి వ‌స్తుంటారు. ఆగ‌స్ట్‌,సెప్టెంబ‌ర్ నెల‌లో జ‌ర‌గ‌నున్న షోకి ఇప్ప‌టి నుండే ప్ర‌చారం నిర్వ‌హించారు దేవి శ్రీ. భ‌ర‌త్ అనే నేను థీమ్ సాంగ్‌తో ఓ వీడియో రూపొందించిన దేవి అందులో సుకుమార్‌తో న‌టింపజేశారు.

‘అమెరికా దేశ ప్రజలందరికీ విజ్ఞప్తి. మీ అందరి చెవుల్లో సంగీతాన్ని నింపడానికి మా డీఎస్పీ వచ్చేస్తున్నాడు.. మరే, ఫ్లైటెక్కొచ్చేస్తున్నాడు. ఆడి పాడి అలరించేస్తాడంతే.. మీరందరూ రెడీగా ఉండండి. అమ్మా, డీఎస్పీ.. వచ్చేయమ్మ నువ్వు’ అంటూ లుంగీ చొక్కా, కళ్లద్దాలు ధరించిన సుకుమార్ చెప్పడం ఆసక్తిదాయకంగా ఉంది. ‘డీఎస్పీ అనే నేను..యూఎస్ఏ వస్తున్నాను. హామీ ఇస్తున్నాను.. ఆడిస్తాను పాడిస్తాను.. ఎంటర్ టెయిన్ చేస్తాను..ప్రామిస్..’ అంటూ దేవిశ్రీ ప్రసాద్ ర‌చ్చ చేస్తున్న‌ట్టు వీడియోలో క‌నిపించాడు . యూఎస్ లో డీఎస్పీ టూర్ ఆగస్టు 11 నుంచి సెప్టెంబరు 16వ తేదీ వరకు కొనసాగనుంది. ఆగ‌స్ట్ 11న సీటెల్‌, 18న చికాగో, 25న డెట్రాయిట్‌, సెప్టెంబ‌ర్ 1న డ‌ల్లాస్, 8న న్యూ జెర్సీ, 16న సాన్ జోస్‌ల‌లో దేవీ మ్యూజిక్ క‌న్స‌ర్ట్ జ‌ర‌గ‌నుంది. స‌మంత చేతుల మీదుగా క‌న్స‌ర్ట్ వీడియోని విడుద‌ల చేయించారు. సాగ‌ర్‌, శ్ర‌ద్ధాదాస్, రైనా రెడ్డి, హేమ చంద్ర‌, శ్రావ‌ణ భార్గ‌వి, మ‌ధు శాలినీలు కూడా ఇందులో భాగం కానున్నారు.


1522
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles