యంగ్ హీరోపై మందుబాబు దాడి.. లైసెన్స్ ర‌ద్దు

Thu,December 7, 2017 11:21 AM
Drunk man assaults actor Arjun Kapoor

బాలీవుడ్ యంగ్ హీరో అర్జున్ క‌పూర్‌పై మందుబాబు దాడి చేశాడు. ఇది రీల్ లైఫ్ లో కాదు రియ‌ల్ లైఫ్‌లోనే. సినిమాల‌లో ఎన్నో ఫైట్స్ చేసే అర్జున్ క‌పూర్‌పై రియ‌ల్ లైఫ్‌లో ఓ మందుబాబు ఆక‌స్మికంగా దాడి చేయడం సెట్‌లో ఉన్న వాళ్లందరిని షాక్‌కి గురి చేసింది. అర్జున్ క‌పూర్ ప్ర‌స్తుతం సందీప్ ఔర్ పింకీ ఫ‌రార్ అనే చిత్ర షూటింగ్ కోసం ఉత్త‌రాఖండ్‌లోని ఫితోరాఘ‌డ్ ప‌ట్ట‌ణానికి వెళ్ళాడు. అక్క‌డ షూటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో మందుబాబు ఫుల్‌గా తాగొచ్చి అర్జున్ క‌పూర్‌కి షేక్ హ్యండ్ ఇస్తూ ఒక్క‌సారిగా దాడికి తెగ‌బ‌డ్డాడు. దీంతో వెంట‌నే అల‌ర్ట్ అయిన సెక్యూరిటీ సిబ్బంది, ఆ మందుబాబుని పోలీసుల‌కి అప్ప‌జెప్పారు. అయితే అర్జున్ క‌పూర్‌పై దాడి చేసిన వ్య‌క్తి పేరు క‌మ‌ల్ కుమార్ కాగా ఇత‌ను లొకేష‌న్‌కి కారులో వ‌చ్చాడ‌ట‌. మ‌ద్యం తాగి కారు న‌డిపినందుకు గాను అత‌నికి కొంత జ‌రిమానా విధించ‌డంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ర‌ద్దు చేసిన‌ట్టుగా తెలుస్తుంది. కాని హీరోపై దాడి చేసినందుకుగాను అత‌నిపై పోలీసులు ఎలాంటి యాక్ష‌న్ తీసుకోలేద‌ని బీటౌన్ మీడియా టాక్.

1674
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS