ఆహ్లాద‌క‌రంగా ఉన్న 'దూరాలే' మెలోడి సాంగ్‌

Sat,September 22, 2018 09:12 AM
Dooraale Lyrical song from Idam Jagath Song

గ‌త ఏడాది మ‌ళ్ళీ రావా అనే డీసెంట్ ల‌వ్ స్టోరీతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సుమంత్ ప్ర‌స్తుతం అనిల్ శ్రీకాంతం ద‌ర్శ‌క‌త్వంలో మ‌ళ్లీ రావా అనే చిత్రం చేస్తున్నాడు. అంజు కురియ‌న్ అనే భామ ఈ చిత్రంతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అవుతుంది. విరాట్ ఫిల్మ్స్, శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమాస్ పతాకాలపై జొన్నగడ్డల పద్మావతి, శ్రీధర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘గుంటూరు టాకీస్’, ‘పీఎస్‌వీ గరుడవేగ’ వంటి చిత్రాలకు పనిచేసిన శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. త్వ‌ర‌లోనే చిత్ర విడుద‌ల‌కి ప్లాన్ చేసిన టీం తాజాగా దూరాలే అనే లిరిక‌ల్ సాంగ్‌ని విడుద‌ల చేసింది. క్రిష్ణకాంత్ రాసిన ఈ పాటను యామిని ఘంటసాల, రవిప్రకాష్ చోడిమల ఆలపించారు. ఈ క్లాసికల్ మెలోడీ వినడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది. ‘దూరాలే కొంచెం కొంచెం.. దూరాలే అవుతున్నట్టు.. దారాలే అల్లేస్తున్న స్నేహాలేవో’ అంటూ క్రిష్టకాంత్ అందించిన సాహిత్యం చాలా బాగుంది. రిలికల్ వీడియోలో కనిపించిన సుమంత్, అంజు కురియన్ జోడి కూడా బాగుంది. ఈ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. చిత్రంలో శివాజీ రాజా, సత్య, ప్రియదర్శిని రామ్, ఆదిత్యమీనన్, కళ్యాణ్ విథపు, షఫీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

1416
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles