సక్సెస్ కొట్టాలన్న కసితో...

Fri,October 7, 2016 12:35 PM
dont breath movie remaked by vikram

వైవిధ్యమైన చిత్రాలలో కొత్త ప్రయోగాలు చేసే విక్రమ్ కి టైం కలిసి రావడం లేదు. ఈ మధ్య తాను చేసిన ప్రతి సినిమాకు డివైడ్ టాక్ రావడంతో విక్రమ్ ఆలోచనలో పడ్డాడు. ఇటీవల డ్యూయల్ రోల్ పాత్రలో ఇంకొక్కడు అనే సినిమా చేయగా ఈ చిత్రం తమిళంలో హిట్ అయినా టాలీవుడ్‌లో మాత్రం యావరేజ్ గానే ఆడిందని టాక్. దాంతో ఎలాగైనా తెలుగులో ఏదోక హిట్ కొట్టాలన్న కసితో ఉన్నాడట విక్రమ్. ఇందుకోసం తను నటించిన ‘సామి’ కి సీక్వెల్‌ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. ఓ మాస్ సినిమా‌తో ముందు సక్సెస్ సాధించి... ఆ తర్వాత మరో థ్రిల్లర్‌కు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇందుకోసం విక్రమ్ ‘డోంట్ బ్రీత్’ అనే ఓ హాలీవుడ్ మూవీని ఎంచుకున్నాడట. మరి ఈ మూవీ ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందో చూడాలి.

2389
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles