'అఅఅ' నుండి డాన్ బాస్కో లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల‌

Tue,November 6, 2018 11:06 AM
Don Bosco Full Song With Lyrics

శ్రీనువైట్ల‌- ర‌వితేజ కాంబినేష‌న్‌లో వచ్చిన ‘నీ కోసం, వెంకీ, దుబాయ్‌ శీను’ వంటి చిత్రాలు మంచి విజ‌యం సాధించ‌డంతో ఇప్పుడు వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న మ‌రో చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోని’ పై భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ నిర్మిస్తున్న ఈ చిత్రం న‌వంబ‌ర్ 16న విడుద‌ల కానుంది. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ప్ర‌మోష‌న్స్ స్పీడ్ పెంచారు మేక‌ర్స్‌. రీసెంట్‌గా క‌ల‌ల క‌థ‌లా అంటూ సాగే పాటని విడుద‌ల చేశారు. థమ‌న్ సంగీత ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సాంగ్ సంగీత ప్రేక్ష‌కుల‌ని అల‌రించింది.ఇక తాజాగా డాన్ బాస్కో అనే పాట‌ని విడుద‌ల చేశారు. శ్రీ కృష్ణ‌, జ‌స్‌ప్రీత్ జాస్జ్‌, హ‌రితేజ‌, మ‌నీషా ఎర్ర‌బ‌త్తిని, ర‌మ్య బెహ్రా ఈ సాంగ్‌ని ఆల‌పించారు. ఈ సాంగ్‌కి కూడా మంచి రెస్పాన్స్ వ‌స్తుది. ‘ఖతర్నాక్, దేవుడు చేసిన మనుషులు, కిక్‌’ చిత్రాల తర్వాత రవితేజ, ఇలియానా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘అమర్‌ అక్బర్‌ ఆంటొని’ భారీ విజ‌యం సాధించ‌డం ఖాయం అంటున్నారు. సునీల్, లయ, వెన్నెల కిషోర్, రవి ప్రకాష్, తరుణ్ అరోరా, ఆదిత్య మీనన్, అభిమన్యు సింగ్, విక్రమ్ జిత్, రాజ్‌వీర్ సింగ్, శుభలేఖ సుధాకర్, శియాజీ షిండే తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను ఈనెల 10న హైదరాబాద్లో ఘనంగా నిర్వహించనున్నారు.

1849
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles