శ్రీదేవి డాక్యుమెంట‌రీ ప్లాన్ చేస్తున్న బోని..!

Fri,March 9, 2018 10:22 AM
documentary plan for sri devi life

అందానికే అసూయ‌పుట్టేంచే అతిలోక సుంద‌రి శ్రీదేవి. ఆమె హ‌ఠాన్మ‌ర‌ణం కోట్లాది అభిమానుల‌కి గుండెకోత‌ను మిగిల్చింది. లేడి సూప‌ర్‌స్టార్‌గా ప్ర‌జ‌ల గుండెల‌లో చెర‌గ‌ని ముద్ర వేసుకున్న శ్రీదేవి భౌతికంగా మ‌న‌తో లేక‌పోయిన ఆమె వెండితెర‌పై పోషించిన పాత్ర‌ల ప‌రంగా ఎప్ప‌టికి ప్ర‌జ‌ల మ‌న‌సుల‌లో చిర‌స్థాయిగా నిలిచి ఉంటుంది. చైల్డ్ ఆర్టిస్ట్ నుండి హీరోయిన్‌గా ఎదిగిన శ్రీదేవి జీవితం ఎంద‌రికో ఆద‌ర్శం. ఆమె జీవితంపై ఇప్పుడు ఓ డాక్యుమెంట‌రీ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడ‌ట శ్రీదేవి భ‌ర్త బోని క‌పూర్‌. బాలీవుడ్‌లో శ్రీదేవికి మంచి హిట్ ఇచ్చిన మిస్ట‌ర్ ఇండియా ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌పూర్ డాక్యుమెంట‌రీని తెర‌కెక్కించ‌నున్నార‌ట‌. శ్రీదేవి మ‌ర‌ణం త‌ర్వాత ఆమె జీవితంకి సంబంధించి ఎన్నో పుకార్లు షికారు చేశాయి. అది బోనిని ఎంత‌గానో బాధించింద‌ట‌. అందుకుని శ్రీదేవి గురించి ప్ర‌పంచానికి తెలియ‌ని విశేషాల‌తో డాక్యుమెంట‌రీ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నాడ‌ట‌. ఇందులో శ్రీదేవికి అత్యంత స‌న్నిహితులుగా ఉన్న కొంద‌రు వారి అభిప్రాయాలు కూడా పంచుకుంటారని స‌మాచారం. మ‌రి దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న ఎప్పుడు వ‌స్తుందో చూడాలి. ఫిబ్ర‌వరి 24న బాత్ ట‌బ్‌లో మునిగి మ‌ర‌ణించిన శ్రీదేవి చివ‌రిగా మామ్ అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. షారూఖ్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కుతున్న జీరో సినిమాలో శ్రీదేవి ముఖ్య పాత్ర పోషించిన‌ట్టు స‌మాచారం.

1676
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles