బిగ్ బాస్‌లోకి డాక్ట‌ర్ ఎంట్రీ.. దీప్తికి ప్ర‌థ‌మ చికిత్స

Tue,August 7, 2018 08:36 AM
doctor enter into bigg boss house

బిగ్ బాస్ సీజ‌న్2 ఆఫ్ సెంచరీ పూర్తి చేసుకోవ‌డంతో బిగ్ బాస్ ఇచ్చే టాస్క్‌లు చాలా క‌ఠిన‌త‌రంగా ఉంటున్నాయి. టాస్క్‌లో పాల్గొనే కంటెస్టెంట్స్ గాయాల‌పాల‌వుతున్నారు. ఎపిసోడ్ 58లో బోనాల పండుగ సంద‌ర్భంగా ఇంటిని అందంగా పూల‌తో అలంక‌రించ‌డం చూపించారు. ఇంటి స‌భ్యులు అంద‌రు సంప్ర‌దాయ‌బ‌ద్దంగా త‌యార‌య్యారు. ఆ త‌ర్వాత నామినేష‌న్ ప్ర‌క్రియ కోసం బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు. గార్డెన్ ఏరియాలో ఉన్న టెంట్లోకి ఎవ‌రు చివ‌రికి చేరుకుంటారో వారి నామినేష‌న్ అయిన‌ట్టు బిగ్ బాస్ అన్నారు. పూజా రామ‌చంద్ర‌న్ కెప్టెన్‌గా ఉండ‌డం, ఇటీవ‌ల క‌మ‌ల్ హాసన్ ఇంట్లోకి వ‌చ్చిన‌ప్పుడు అమిత్‌కి సేవ్ కార్డ్ ఇవ్వ‌డంతో ఈ ఇద్ద‌రు టాస్క్‌కి మిన‌హాయింపు.

సోమవారం రోజు జ‌రిగిన టాస్క్‌లో మ్యూజిక్ ప్లే కాగానే ఇంటి స‌భ్యులు టెంట్‌లోకి వెళ్లాల్సి ఉండ‌గా, తొలి సారి మ్యూజిక్ ప్లే అయిన‌ప్పుడు బాబు గోగినేని చివ‌రికి టెంట్‌లోకి వెళ్లారు. దీంతో ఆయ‌న తొలుత నామినేష‌న్‌లో నిలిచారు. రెండోసారి మ్యూజిక్ ప్లే అయిన‌ప్పుడు అంద‌రు టెంట్‌లోకి వెళ్ళ‌గా గీతా వెనుక‌బ‌డింది. దీంతో రెండో నామినేషన్‌గా గీతా మాదురి ఎంపికైంది. మూడో నామినేష‌న్ కోసం గ‌ణేష్‌, నాలుగో నామినేష‌న్‌లో శ్యామ‌ల నిలిచారు. దీప్తి సున‌య‌న కోసం
త్యాగం చేసిన త‌నీష్ నామినేషన్‌లో ఐదో వ్య‌క్తిగా ఉన్నాడు. ఇక చివ‌రిగా టెంట్‌లోకి వెళ్ళే క్ర‌మంలో దీప్తి, రోల్ రైడాలు కింద‌ప‌డ్డారు. ఈ క్ర‌మంలో దీప్తి కాలుకి గాయ‌మైంది. ఇంట్లోకి వ‌చ్చిన డాక్ట‌ర్ దీప్తిని క‌న్ఫెష‌న్ రూంలోకి తీసుకెళ్లి ప్ర‌థ‌మ చికిత్స చేశారు

ఎపిసోడ్ 58లో భాగంగా జ‌రిగిన టాస్క్‌లో శ్యామ‌ల‌, నూత‌న్ నాయుడు, దీప్తి సున‌య‌న‌కి కూడా గాయాల‌య్యాయి. అయితే దీప్తి, రోల్ రైడాల‌లో ఎవరు ముందు టెంట్‌లోకి ప్రవేశించారు..? అనేదానిపై సందిగ్ధత నెలకొనగా.. సుదీర్ఘ చర్చ అనంతరం కెప్టెన్.. రోల్‌రైడ్‌ వైపే మొగ్గు చూపింది. దీంతో దీప్తి నామినేష‌న్‌కి ఎంపికైంది. మొత్తంగా ఈ వారం నామినేషన్‌లోకి నిలిచిన‌ సభ్యులు.. బాబు గోగినేని, తనీశ్, గీతా మాధురి, గణేశ్, శ్యామల, దీప్తి. మ‌న నామినేష‌న్ స్టార్ మ‌రో సారి నామినేష‌న్‌లో నిల‌వ‌డం విశేషం. ఇక టాస్క్ త‌ర్వాత కొద్ది సేపు గీతా మాధురి, శ్యామ‌ల‌, కౌశ‌ల్ మ‌ధ్య చిన్నపాటి చ‌ర్చ‌లు జ‌రిగాయి. ఈ చ‌ర్చ‌ల‌లో త‌నకి బాధ అనిపించిన‌ప్పుడు ఏ విష‌యాన్నైనా గీతా మాధురి, దీప్తితో చెప్పుకుంటాన‌ని అన్నాడు కౌశ‌ల్‌. దీప్తి సున‌య‌న కోసం తనీష్ ఆడిన గేమ్ బాలేద‌ని కూడా పేర్కొన్నాడు.

టాస్క్‌లో దీప్తి సున‌య‌న తోసేసి రావొచ్చు క‌దా అని కౌశ‌ల్ , శ్యామ‌ల‌తో చెప్ప‌గా ఈ విష‌యంపై స్టోర్ రూంలో శ్యామ‌ల‌, దీప్తి, గీతా మాధురి ల మధ్య చ‌ర్చ జ‌రిగింది. ఒక వైపు న్యాయం అని మాట్లాడుతూ మ‌రో వైపు ఇలా చేయండ‌ని మాట్లాడ‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్ అని గీతా మాధురి చెప్పుకొచ్చింది. ఇంతలోనే కౌశ‌ల్ స్టోర్ రూంలోకి ఎంట్రీ ఇవ్వ‌గా, మీ గురించే మాట్లాడుకుంటున్నామ‌ని గీతా ..కౌశ‌ల్‌తో చెబుతుంది. ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ టాస్క్‌లో మీరు చేసిన ప‌ని త‌ప్పు కాదా అని కౌశ‌ల్‌ని గీతా ప్ర‌శ్నించ‌గా, గ‌తాన్ని త‌వ్వి పెంట పెట్టొందంటూ కౌశల్‌.. గీతాని కోర‌తాడు. దీంతో 58వ ఎపిసోడ్ ముగుస్తుంది.

4780
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles