మహేశ్ కొత్త సినిమా నిర్మాత ఎవరో తెలుసా..?

Fri,June 22, 2018 04:19 PM
Do You know who is produce Mahesh Babu, sandeep vanga movie

టాలీవుడ్ నటుడు మహేశ్‌బాబు ప్రస్తుతం వంశీపైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. వంశీ పైడిపల్లి మూవీ సెట్స్‌పై ఉండగానే అర్జున్ రెడ్డి ఫేం సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్‌లో మరో సినిమాలో నటించేందుకు గ్నీన్‌సిగ్నల్ ఇచ్చాడు. అయితే ఈ సినిమాకు సంబంధించిన న్యూస్ ఒకటి ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నది.

మహేశ్-సందీప్ చిత్రాన్ని కేఎస్ రామారావు నిర్మించనున్నారట. చిత్రయూనిట్ ఈ ప్రాజెక్టు కోసం హీరోయిన్‌ను వెతికే పనిలో పడినట్లు టాక్. కేఎస్ రామారావు ప్రస్తుతం బోయపాటి, రాంచరణ్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం పూర్తవగానే మహేశ్ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేస్తుందని టాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి.

1643
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles