అసలు ఎవరీ కత్తి మహేశ్..?

Mon,January 8, 2018 01:12 PM
Do you know who is kathi mahesh..?


హైదరాబాద్ : కత్తి మహేశ్. కొన్నాళ్లుగా ఫిలిం ఇండస్ట్రీలో కొనసాగుతున్నా ఐదారు నెలల క్రితం వరకు ఎవరికీ పెద్దగా తెలియని పేరు. ఎపుడైతే టాలీవుడ్ నటుడు, జనసేన అధినేత పవన్‌కల్యాన్‌ను టార్గెట్ చేయడం ప్రారంభించాడో ఒక్కసారిగా పాపులర్ అయిపోయాడు కత్తి మహేశ్. ఈ మధ్య కాలంలో సోషల్‌మీడియాలో కత్తి మహేశ్ గురించి పెద్ద ఎత్తు చర్చ నడుస్తుందంటే అతిశయోక్తి కాదు. మహేశ్ తాజాగా పవన్, పవన్ ఫ్యాన్స్‌తోపాటు పూనమ్‌కౌర్, కోనవెంకట్‌లపై ధ్వజమెత్తాడు. రోజుకో వాదనతో మీడియా ముందుకొస్తూ వార్తల్లో నిలుస్తున్న కత్తి మహేశ్ ఎవరు..?ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో జన్మించాడు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఫిల్మ్ థియరీలో స్పెషలైజేషన్ చేశాడు. దేవరకొండ బాలగంగాధర్ తిలక్ జీవితం ఆధారంగా వచ్చిన ఎదరి వర్షం మూవీతో తన సినీ కెరీర్ ను ప్రారంభించాడు. తెలుగులో తొలిసారిగా ఊరు చివర ఇల్లు అనే షార్ట్ ఫిలిం తీశాడు. మినుగురులు సినిమాకు సహ రచయితగా వ్యవహరించాడు. ఇక 2015లో రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా పెసరట్టు సినిమాకు దర్శకత్వం వహించారు.

ఆ తర్వాత సంపూర్ణేశ్‌బాబు హృదయ కాలేయం సినిమాలో పోలీసాఫీసర్ పాత్రలో కనిపించాడు. 2017లో స్టార్ మాలో జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన టీవీ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 1లో కంటెస్టెంట్‌గా కనిపించాడు. ఎగిసే తారాజువ్వలు సినిమాకు దర్శకత్వం వహించాడు. అదేవిధంగా కొబ్బరిమట్ట, నేనే రాజు నేనే మంత్రి సినిమాలో ఛాయ్ అమ్మే వ్యక్తి పాత్రలో కనిపించాడు. ప్రస్తుతం ఫిలిం క్రిటిక్‌గా కొనసాగుతున్నాడు.

6800
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles