'మహానటి'చిత్రంలో 'అహనా పెళ్లంట'పాటకు కొరియోగ్రఫీ చేసిందెవ‌రో తెలుసా?

Wed,May 16, 2018 06:07 AM
Do you know who has done choreography for Ahana Pellanta in the film Mahanati?


హైదర్‌నగర్ : శేరిలింగంపల్లి నియోజకవర్గం హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని రిషి మహిళా కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్న ఎన్‌ఎస్‌ఎల్ ప్రవీణ నృత్యంలోనూ తన ప్రతిభను చాటుకుంటోంది. తాజాగా విడుదలైన మహానటి చిత్రంలో అహనా పెళ్లంట అనే పాటకు అనీ మాస్టర్‌తో కలిసి కొరియోగ్రాఫర్‌గా బాధ్యతలు నిర్వహించింది ప్రవీణ. బాలివుడ్ ప్రముఖ నృత్య దర్శకురాలు సరోజ్‌ఖాన్ వద్ద నృత్యంలో శిక్షణ పొందిన ప్రవీణ టాలివుడ్‌లో ప్రేమ్ రక్షిత్ మాస్టర్‌కు శిష్యురాలిగా పనిచేస్తున్నది.

నృత్యం లో నైపుణ్యం ఉండి..

తెలుగు చిత్ర సీమలో కొరియో గ్రాఫర్‌గా అరంగేట్రం చేయాలన్న ప్రవీణ కలకు ప్రముఖ దర్శకులు స్వప్నాదత్, ప్రియాంకాదత్‌లు సంపూర్ణ తోడ్పాటు నందించి ప్రోత్సహించారు. గతంలో బాహుబలి చిత్రంలో కన్నా నిదురించరా పాటకు సైతం ప్రవీణ ప్రముఖ నృత్య దర్శకురాలికి సహాయకారిగా తోడ్పాటు నందించింది.

అధ్యాపకురాలిగా పనిచేస్తున్నా...

చిన్ననాటి నుంచి చిత్రసీమలో కొరియోగ్రాఫర్‌గా ఎదగాలన్నదే తన కలని, దానిని నిజం చేసుకోవటంలో స్వప్నాదత్, ప్రియాంకదత్‌ల తోడ్పాటు, సహాయం జీవితాంతం మరిచిపోలేనని ప్రవీణ పేర్కొంది. మహానటి లాంటి క్లాసికల్ చిత్రంలో 20 మంది వరకూ మహిళా టెక్నీషియన్‌లకు అవకాశం కల్పించగా..అందులో ఒకరు తానవటం అదృష్టంగా భావిస్తున్నట్లు ప్రవీణ తెలిపింది. భవిష్యత్‌లో టాలివుడ్‌లో మంచి కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు పొందాలన్నదే తన లక్ష్యమని, ఇందుకోసం తగిన కృషి చేస్తానని, తనకు కొరియోగ్రాఫర్‌గా అవకాశం కల్పించిన వారిని ఎన్నటికీ మరువనని తెలిపారు.

కాగా తమ కళాశాలలో అధ్యాపకురాలిగా పని చేస్తూ...తెలుగు చిత్ర సీమలో కొరియోగ్రాఫర్‌గా అరంగేట్రం చేయటం పై ప్రవీణను రిషి మహిళా కళాశాల కరస్పాండెంట్ రాజశ్రీ అభినందించారు. ప్రవీణ ద్వారా మరికొందరు జూనియర్ నృత్య కారిణికులకు సైతం మహానటిలో ఓ పాటకు అవకాశం లభించటం గమనార్హం.

6440
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles