మా పెళ్లికి బహుమతులు ఇవ్వొద్దు!

Tue,November 13, 2018 03:34 PM
Do not offer us gifts instead donate them to charity says Deepika and Ranveer

బాలీవుడ్ సెలబ్రిటీ జంట దీపికా పదుకోన్, రణ్‌వీర్‌సింగ్ మరికొద్ది గంటల్లో పెళ్లితో ఒక్కటి కానున్నారు. ఇటలీలోని విలా డెల్ బాల్బియానెలొలో ఉన్న లేక్ కోమోలో పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి సంగీత్ జరగనుంది. దీనికోసం ఇప్పటికే పలువురు బాలీవుడ్ సింగర్లు ఇటలీకి చేరుకున్నారు. బుధ, గురువారాల్లో హిందూ, సిక్కు సాంప్రదాయం ప్రకారం పెళ్లి తంతు జరగనుంది. పెళ్లికి వచ్చే అతిథులెవరికీ మొబైల్ ఫోన్లను అనుమతించడం లేదు. ఇక తమ పెళ్లికి వచ్చే వాళ్లు ఖరీదైన బహుమతులు కూడా తీసుకు రావద్దని ఈ జంట కోరుతున్నది. తమకు గిఫ్ట్‌లు ఇచ్చే బదులు ఆ మొత్తాన్ని తన ఎన్జీవో ద లివ్ లవ్ లాఫ్ ఫౌండేషన్‌కు విరాళంగా ఇవ్వాలని దీపికా ఇప్పటికే అతిథులకు స్పష్టం చేసినట్లు డీఎన్‌ఏ, మిడ్ డే పత్రికలు వెల్లడించాయి. వధువు, వరుడు తమపై కానుకల వర్షం కురిపించవద్దని కోరారు.

ఒకవేళ ఇవ్వాలనుకుంటే దీపికా ఫౌండేషన్‌కు ఇవ్వాలని చెప్పారు. ఈ ఫౌండేషన్ డిప్రెషన్‌తో బాధపడుతున్న వారికి సాయం చేస్తున్నది. ఒకప్పుడు ఇదే డిప్రెషన్‌తో బాధపడిన దీపికా.. ఇప్పుడు ఆ జబ్బుపై ప్రజల్లో అవగాహన కల్పించే ఉద్దేశంతో ఉంది అని మిడ్ డే పత్రిక తెలిపింది. పెళ్లి కోసం దీపికా, రణ్‌వీర్ జోడీ గత వారాంతంలోనే ఇటలీలో అడుగుపెట్టారు. ఈ పెళ్లికి ఇద్దరి కుటుంబ సభ్యులతోపాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కాబోతున్నారు. బాలీవుడ్ నుంచి షారుక్‌ఖాన్, ఫరాఖాన్, సంజయ్ లీలా భన్సాలీ పెళ్లికి హాజరయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నెల చివర్లో ఇండియాలో వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు.

3044
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles