సంవత్సరం తర్వాత మళ్ళీ కలిసాం: పూజా హెగ్డే

Sat,May 26, 2018 03:59 PM
dj reunion almost year after

చివరిగా డీజే (దువ్వాడ జగన్నాథమ్ ) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అందాల భామ పూజా హెగ్డే. ముకుంద చిత్రంతో తెలుగు తెరకి పరిచయమైన ఈ అమ్మడు బాలీవుడ్ లోను నటించింది. ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన అరవింద సమేత రాఘవ అనే చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు రీసెంట్ గా తన ట్విట్టర్ పేజ్ లో డీజే టీంతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ .. దాదాపు సంవత్సరం తర్వాత టీం అందరం మళ్ళీ కలిసాం అని కామెంట్ పెట్టింది. అనుకోకుండా ఈ కలయిక జరిగిందంటూ యాష్ ట్యాగ్ జత చేసింది. పూజ షేర్ చేసిన ఫోటోలో బన్నీ, దర్శకుడు హరీష్ శంకర్, సినిమాటోగ్రాఫర్ బోస్ ఉన్నారు. దువ్వాడ జగన్నాథమ్ చిత్రం తెలుగులో వంద కోట్ల కలెక్షన్స్ సాధించగా, తమిళ, మలయాళ రాష్ట్రాలలోను భారీ వసూళ్లు సాధించింది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం కూడా చిత్ర విజయంలో భాగం అయింది. జూన్ 23,2017న డీజే చిత్రం తెలుగు రాష్ట్రాలలో విడుదలైన సంగతి తెలిసిందే.


4133
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles