మ‌ల‌యాళీల‌కు బ‌న్నీ బొనాంజా

Fri,July 7, 2017 02:58 PM
DJ MALAYALAM OFFICIAL TEASER released

న‌ట‌న‌లోనే కాకుండా డ్యాన్సింగ్ లోను అదుర్స్ అనిపించుకున్న అల్లు అర్జున్ కి తెలుగులోనే కాదు మ‌ల‌యాళంలోను భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయ‌న ప్ర‌తి సినిమా మాలీవుడ్ లో విడుద‌లై మంచి విజ‌యం సాధిస్తుంటుంది. తాజాగా దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ చిత్రాన్ని కూడా మ‌ల‌యాళంలో విడుద‌ల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు నిర్మాత‌లు. తెలుగులో 100 కోట్ల వ‌సూళ్ళు రాబ‌ట్టిన డీజే మ‌ల‌యాళంలోను మంచి వ‌సూళ్ళ‌ను రాబ‌డుతుంద‌ని నిర్మాత‌లు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో జూలై 14న చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మ‌ల‌యాళంలో ఈ చిత్రానికి ధృవ‌రాజ జ‌గ‌న్నాథ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. తెలుగులో డీజే చిత్రానికి డివైడ్ టాక్ రాగా, మాలీవుడ్ లో పాజిటివ్ టాక్ అందుకుంటుంద‌ని యూనిట్ భావిస్తుంది. తాజాగా చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇందులోని సీన్స్ మ‌ల‌యాళీల‌కు మంచి కిక్ ఇస్తున్నాయి . హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన డీజే చిత్రంలో పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టించింది. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించాడు.

1628
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles