డీజే ఆడియో రిలీజ్ డేట్ ఫిక్స్ !

Wed,June 7, 2017 06:17 PM
dj audio release date fix

ఇటీవ‌ల ప్రోమో సాంగ్స్ తో సంద‌డి చేసిన దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ ఆడియో వేడుకకి డేట్ ఫిక్స్ చేసుకున్న‌ట్టు తెలుస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన టీజ‌ర్, ట్రైల‌ర్, ప్రోమో సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ రావ‌డంతో సినిమాపై కూడా భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. దేవి శ్రీ ప్ర‌సాద్ ఎప్ప‌టిలాగానే త‌న దైన స్టైల్ లో మంచి మ్యూజిక్ అందించాడు. చిత్రంలోని మిగ‌తా పాట‌ల‌ను జూన్ 11న శిల్ప‌క‌ళా వేదిక‌లో జ‌ర‌గ‌నున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విడుద‌ల చేయ‌నున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, గ్లామ‌ర్ బ్యూటీ పూజా హెగ్డేల రొమాన్స్ ఆడియ‌న్స్ కి మంచి కిక్ ఇస్తుంద‌ని అంటున్నారు. దువ్వాడ జ‌గ‌న్నాథం చిత్రం దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతున్న25వ చిత్రం కాగా, ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక‌ని గ్రాండ్ గా నిర్వ‌హించాల‌ని భావిస్తున్నారు. జూన్ 23న విడుద‌ల కానున్న ఈ సినిమాకి భారీ ప్ర‌మోష‌న్స్ చేస్తున్నారు.

1644
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles