ప్రేమ‌కి పులిస్టాప్ పెట్టిన బాలీవుడ్ జంట‌

Tue,June 25, 2019 12:34 PM
Disha Patani And Tiger Shroff Have Officially Broken up

బాలీవుడ్ జంట దిశా ప‌ఠానీ, టైగ‌ర్ ష్రాష్ కొన్నాళ్ళుగా ప్రేమ‌యాణంలో ఉన్న సంగ‌తి తెలిసిందే. కొద్ది రోజులుగా జంట‌గా ఎంతో ఆప్యాయంగా క‌నిపిస్తున్న ఈ జంట ప్ర‌స్తుతం విడివిడిగా క‌నిపిస్తున్నార‌ని త‌మిళ మీడియా చెబుతుంది. అంతేకాదు వారిద్ద‌రి మ‌ధ్య ప్రేమ‌కి బ్రేక్ ప‌డింద‌ని కూడా స‌ద‌రు మీడియా ప‌త్రిక రాసుకొచ్చింది. వారిద్ద‌రు ప‌ర‌స్ప‌రం ఒప్పందం ప్ర‌కార‌మే వీడిపోయార‌ట‌. ఇద్ద‌రు ప్ర‌స్తుతం త‌మ త‌మ ప్రాజెక్టుల పైనే దృష్టి సారించాల‌ని ఈ జంట భావిస్తుంద‌ట‌.

ఆ మ‌ధ్య‌ ముంబైలోని బస్టియన్ రెస్టారెంట్‌కు ఈ జంట వెళ్ళింది. దిశా పటానీ రెస్టారెంట్ బయటకు రాగా..ఆ ఫొటోలు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారడంతో ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో రెస్టారెంట్ వద్దకు వచ్చారు. అభిమానులంతా ఒక్కసారిగా దిశాపటానీ దగ్గరకు వచ్చేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న టైగర్ తన బాడీగార్డ్స్‌తో అక్కడికి వచ్చి..రద్దీగా ఉన్న అభిమానుల నుంచి దిశాపటానీని కాపాడి సురక్షితంగా కారులో ఎక్కించాడు. టైగర్, దిశా తరచుగా ముంబైలోని బస్టియన్ రెస్టారెంట్‌కు వెళ్తుంటారు. ఇటీవలే దిశా పటానీ తన పుట్టినరోజు వేడుకలను టైగర్‌తో కలిసి ఇదే రెస్టారెంట్‌లో జ‌రుపుకుంది. బాఘీ 2, ఎంఎస్ ధోనీ, కుంగ్ ఫూ యోగా, లోఫర్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది దిశా. ఒక టైగ‌ర్ ప్ర‌స్తుతం భాఘీ ఫ్రాంచైజ్‌లో సినిమా చేస్తున్నాడు.

2941
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles