రెండో పెళ్లి చేసుకోనున్న అమ‌లాపాల్ మాజీ భ‌ర్త..!

Sat,July 7, 2018 09:47 AM
Director Vijay  second marriage with unknown person

కొన్నాళ్ళు డేటింగ్ తర్వాత జూన్ 12, 2014లో మూడు ముళ్ళ బంధంతో ఒక్కటైన అమలా పాల్- విజయ్ జంట 2016లో విడిపోయిన సంగతి తెలిసిందే. కొన్ని మనస్పర్ధల కారణంగా వీరిరివురు విడిపోయారు. ప్ర‌స్తుతం ద‌ర్శ‌కుడిగా ఏఎల్ విజ‌య్ బిజీ కాగా, న‌టిగా అమ‌లాపాల్ వ‌రుస సినిమాలు చేస్తుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం విజ‌య్ రెండో మ్యారేజ్ చేసుకోబోతున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. విజ‌య్ త‌ల్లిదండ్రులు త‌మ కొడుకు కోసం అమ్మాయిని వెతికే ప‌నిలో ఉన్నార‌ట‌. ఈ ఏడాది చివరిలో విజ‌య్ పెళ్లి చేయాల‌ని వారు అనుకుంటున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే విజ‌య్ స‌న్నిహితులు మాత్రం ఇదంతా రూమ‌ర్ అంటూ కొట్టి పారేస్తున్నారు. విజ‌య్ ప్ర‌స్తుతం ప్ర‌భుదేవా హీరోగా ల‌క్ష్మీ అనే సినిమా చేస్తున్నాడు. మ‌రోవైపు అమ‌లాపాల్ కూడా ప‌లు సినిమాల‌తో బిజీ అయింది. కేర‌ళ‌లో నివసిస్తూ పుదుచ్చేరిలో ఉంటున్న‌ట్టు త‌ప్పుడు ప‌త్రాన్నిచూపిన కార‌ణంగా ఈమెపై త్వ‌ర‌లో చార్జిషీట్ దాఖ‌లు చేయ‌నున్న‌ట్టు ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

2695
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles