బాలీవుడ్ దర్శకుడు తులసి రామ్‌సే కన్నుమూత

Fri,December 14, 2018 03:36 PM
Director tulsi ramsay passes away

ముంబై: హార్రర్ చిత్రాల దర్శకుడు తులసి రామ్‌సే (74) కన్నుమూశారు. తులసి రామ్‌సేకు ఛాతి నొప్పి రావడంతో ఆయన కుమారుడు ముంబైలోకి కోకినాబెన్ ఆస్పత్రికి తరలించారు. తులసి రామ్‌సే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఎఫ్‌యూ రామ్ సే ఏడుగురు కుమారుల్లో తులసి రామ్ సే ఒకరు. తులసి రామ్ సే తీసే చిత్రాలకు ఆయన ఆరుగురు సోదరులు కూడా వివిధ విభాగాల్లో పనిచేశారు. తులసీ రామ్‌సే వీరన, పురాణీ హవేలీ, బంద్ దవాజా, పురానా మందిర్ వంటి హార్రర్ చిత్రాలతోపాటు 90లలో పాపులర్ అయిన జీ హార్రర్ షో టీవీ సిరీస్‌కు దర్శకత్వం వహించారు.

1580
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles