ఆర్టిక‌ల్ 370 నేప‌థ్యంలో తేజ చిత్రం?

Tue,November 12, 2019 10:56 AM

చివ‌రిగా బెల్లంకొండ శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సీత అనే చిత్రాన్ని తెర‌కెక్కించిన సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు తేజ ఓ ఇంట్రెస్టింగ్ స‌బ్జెక్ట్‌తో చిత్రాన్ని తెర‌కెక్కించేందుకు స‌న్నాహాలు చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు అంశం మ‌న దేశంలో ప్ర‌కంప‌న‌లు సృష్టించింది. ర‌ద్దు వ‌ల‌న జమ్మూకశ్మీర్ రెండు ముక్కలుగా విడిపోయింది. అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూ-కశ్మీర్ ఏర్పడగా, అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్ ఏర్పడింది. ఇప్పుడు ఆర్టిక‌ల్ 370 అంశాన్ని తీసుకొని బాలీవుడ్ సినిమా చేయాల‌ని తేజ క‌స‌ర‌త్తులు చేస్తున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ ఈ సినిమా చేస్తార‌ని అభిమానులు భావించ‌గా, తెలుగు ద‌ర్శకుడు ఆర్టిక‌ల్ 370 నేప‌థ్యంలో సినిమా చేయాలని అనుకుంటుండ‌డం గొప్ప విష‌యం అని నెటిజ‌న్స్ అంటున్నారు. ఇప్ప‌టికే ఆర్టిక‌ల్ 15 నేప‌థ్యంతో సినిమా తెర‌కెక్క‌గా, ఈ సినిమా మంచి విజ‌యం సాధించింది. ఆయుష్మాన్ ఖురానా ఇందులో ప్ర‌ధాన పాత్ర పోషించారు.

998
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles