పాట‌ పాడ‌న‌న్నందుకు.. ద‌ర్శ‌కుడు ఆత్మ‌హ‌త్యాయత్నం

Thu,November 22, 2018 01:22 PM
director suicide cause of anirudh

అతి త‌క్కువ వ‌య‌స్సులో టాప్ మ్యూజిక్ డైరెక్ట‌ర్స్‌లో ఒక‌రిగా నిలిచిన సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్ ర‌విచంద్ర‌న్‌. ఒక‌వైపు సంగీతం స‌మకూరుస్తూనే మ‌రో వైపు గాయ‌కుడిగా కూడా అద‌ర‌గొడుతున్నాడు. ఇటీవ‌ల తెలుగులోను టాప్ హీరోల సినిమాల‌కి సంగీతం అందిస్తున్నాడు. అయితే త‌న బిజీ షెడ్యూల్ కార‌ణంగా ఓ సినిమాలో పాట పాడేందుకు నో చెప్ప‌డంతో ఆ సినిమా ద‌ర్శ‌కుడు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసుకోవ‌డం సంచ‌ల‌నం రేపుతుంది. వివ‌రాల‌లోకి వెళితే నటుడిగా కొన్ని సినిమాలలో నటించిన పొన్నుడి దర్శకుడిగా మారి 'సోమపాన రూప సుందరన్' అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

మెర్లిన్‌ చిత్రం ఫేమ్‌ విష్ణుప్రియన్‌ హీరోగా నటిస్తున్న 'సోమపాన రూప సుందరన్' సినిమాలో బిగ్ బాస్ ఫేమ్ ఐశ్వర్య దత్తా హీరోయిన్ గా కనిపించనుంది. ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో ఐశ్వ‌ర్య‌కి బిగ్ బాస్ హౌజ్ నుండి పిలుపు రావ‌డంతో ఆమె అక్క‌డికి వెళ్లింది. దీంతో షూటింగ్ కాస్త డిలే అయింది. ఈ త‌రుణంలో చిత్రంలోని ఒక‌పాట‌ను యువ సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్ ర‌విచంద్ర‌న్‌తో పాడించాల‌ని ద‌ర్శ‌కుడు ప్ర‌య‌త్నించాడు. బిజీ షెడ్యూల్ కారణంగా అనిరుధ్‌ నో చెప్పేశాడు. దీంతో ఈ సినిమా దర్శకనిర్మాతల మధ్య కొన్ని విబేధాలు తలెత్తాయి. మనస్తాపం చెందిన దర్శకుడు పొన్నుడి నిద్రమాత్రలు మింగి సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించాడు.

పొన్నుడి స‌హాయ ద‌ర్శకులు స‌మ‌యానికి ఆయ‌న‌ని ఆసుప‌త్రిలో చేర్చ‌డంతో పొన్నుడి పెద్ద ప్ర‌మాదం నుండి బ‌య‌ప‌టప‌డ్డాడు. ప్ర‌స్తుతం విశ్రాంతి తీసుకుంటున్న ఆయ‌న ఎందుకు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసుకున్నాడ‌నే దానిపై వివ‌ర‌ణ ఇచ్చాడు. మా మ్యూజిక్ డైకెక్ట‌ర్ అబ్బాస్ ర‌ఫీ చిత్రం కోసం అనిరుధ్‌తో పాట‌పాడిస్తాన‌ని మాట ఇచ్చారు. దీంతో మేము షూటింగ్‌కి సంబంధించి ఏర్పాట్లు చేసుకున్నాం. కాని అనిరుధ్ కుద‌ర‌ద‌ని చెప్ప‌డంతో నిర్మాణ ప‌నులు అన్నీ నిలిచిపోయాయి. దీంతో ఏం చేయాలో తెలియ‌క ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డిన‌ట్లు తెలిపారు. ఇప్ప‌టికి మూవీకి సంబంధించి ప‌రిష్కారం వ‌స్తుంద‌నే న‌మ్మ‌కం లేదంటూ భావోద్వేగంతో పొన్నుడి ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

2316
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles