వివేగంకి సంబంధించిన ఆస‌క్తిక‌ర విష‌యాలు

Thu,June 29, 2017 01:13 PM
director siva clarity on vivegam

శివ ద‌ర్శ‌క‌త్వంలో త‌ల అజిత్ చేస్తున్న చిత్రం వివేగం. ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఇక అప్ప‌టి నుండి సినిమాపై భారీ అంచ‌నాలు పెరిగాయి. త‌ల అజిత్ పై అభిమానులే కాదు సెల‌బ్రిటీలు ప్ర‌శంసల వర్షం కురిపించారు. ఇక ఈ మూవీ 120 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్క‌తుంద‌ని తెలుస్తుండ‌గా, చిత్రానికి సంబంధించిన కొన్ని విష‌యాలు డైరెక్ట‌ర్ రివీల్ చేశాడు. స్పై థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కుతున్న చిత్రంలో కాజ‌ల్ అగ‌ర్వాల్ తో పాటు అక్ష‌ర హాస‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అక్ష‌ర పాత్ర చుట్టే సినిమా అంతా తిరుగుతుంద‌ట‌. బాలీవుడ్ న‌టుడు వివేగంలో ప్ర‌తి నాయ‌కుడి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడ‌ని కొన్నాళ్ళుగా ప్ర‌చారం జ‌రిగింది. కాని ఇదంతా అబ‌ద్దం, వివేక్ ఒక ప‌వ‌ర్ ఫుల్ రోల్ లో క‌నిపిస్తాడ‌ని ద‌ర్శ‌కుడు క్లారిటీ ఇచ్చాడు. వివేగ చిత్రం సెర్బియా, బ‌ల్గేరియా, ఆస్ట్రియా మ‌రియు కురోషియా వంటి ప్రాంతాల‌లో మేజ‌ర్ పార్ట్ చిత్రీక‌ర‌ణ జ‌రుపుకోగా, కొద్ది పార్ట్ మాత్ర‌మే ఇండియాలో జ‌రుపుకుందట‌. ఈ చిత్రాన్ని ఇండిపెండెన్స్ డే కానుక‌గా విడుద‌ల చేయాల‌ని టీం భావిస్తుంద‌ట‌.

1709
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles