ఈఏడాది రాజమౌళికి నచ్చిన సినిమా అదే!

Fri,December 15, 2017 04:09 PM
director rajamouli likes this movie too apart from bahubali2 in 2017

బాహుబలి సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన జక్కన్నకు ఈ సంవత్సరంలో బాహుబలి2తో పాటు మరో సినిమా తెగ నచ్చిందట. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను చెప్పాడు రాజమౌళి. అదేం సినిమా అని మీరు ఓసారి తెలుగు సినిమాల లిస్ట్‌ను మైండ్‌లో గుర్తు తెచ్చుకుంటున్నారా?

ఆ సినిమా బ్లాక్‌బస్టర్ సినిమానే. అదే అర్జున్ రెడ్డి సినిమా. అవును.. ఆ సినిమానే ఈ దర్శకధీరుడికి తెగ నచ్చిందట. ఓ చిన్న సినిమాగా రిలీజ్ అయి రికార్డులను తిరగ రాసిన సినిమా అది. విజయ్ దేవరకొండ, షాలినీ పాండే జంటగా నటించిన అర్జున్ రెడ్డికి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. ఆ సినిమా రిలీజయినప్పుడు కూడా ట్విట్టర్ ద్వారా ఆ సినిమాపై జక్కన్న ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.

2558
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS