క్వీన్ రీమేక్ నుంచి తప్పుకున్న డైరెక్టర్..?

Fri,January 12, 2018 06:29 PM
director Neelakantha Quits from Queen Remake


హైదరాబాద్: హిందీలో సూపర్‌హిట్ చిత్రంగా నిలిచిన క్వీన్ మూవీని తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. క్వీన్ తెలుగు, మలయాళ రీమేక్ సినిమాలకు నీలకంఠ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు రీమేక్‌లో తమన్నా, మలయాళ వెర్షన్‌లో మంజిమమోహన్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇప్పటికే తెలుగు వెర్షన్‌కు సంబంధించి గత డిసెంబర్‌లో కొంతభాగం షూటింగ్ కూడా జరిగినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఓ న్యూస్ టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నది.

కొన్ని కారణాల వల్ల డైరెక్టర్ నీలకంఠ ఈ సినిమా నుంచి అర్థాంతరంగా తప్పుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. మలయాళ వెర్షన్ డైరెక్షన్‌ను మాత్రం కంటిన్యూ చేయాలని ఫిక్స్ అయ్యాడట నీలకంఠ. మరి తెలుగు రీమేక్ ప్రాజెక్టు విషయంపై పూర్తి క్లారిటీ రావాలంటే చిత్రయూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. అప్పటివరకు వెయిట్ చేయాలి మరి. కంగనారనౌత్ హీరోయిన్‌గా నటించిన క్వీన్ రికార్డుల వర్షం కురిపించింది.

1476
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles