తెలంగాణ సినీ దర్శకుడు రంగారావు ఇకలేరు!

Mon,January 14, 2019 12:26 PM
director katta  Ranga Rao passes away in Hyderabad

హైదరాబాద్: ప్రముఖ తెలుగు సినీ దర్శకుడు కట్టా రంగారావు అనారోగ్యంతో కన్నుమూశారు. చివరగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన జయ జానకి నాయక సినిమాకు దర్శకత్వ శాఖలో పనిచేశారు. తెలంగాణకు చెందిన ఈ డైరెక్టర్ కమ్యూనిస్టు కుటుంబం నుంచి వచ్చారు. తన సినీ కెరీర్ ఆరంభంలో విప్లవ భావజాల సినిమాలు తీసి గుర్తింపు తెచ్చుకున్నారు. 1957 మే 5వ తేదీ జన్మించిన రంగారావు ఇంద్రధనుస్సు చిత్రంతో దర్శకుడిగా సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు.

1990ల్లో కమర్షియల్ సినిమాలు తెరకెక్కించారు. ఇంద్ర ధనుస్సు, ఆఖరి క్షణం, ఉద్యమం, అలెగ్జాండర్, నమస్తే అన్నా, బొబ్బిలి బుల్లోడు, వారెవా మొగుడా, చెప్పుకోండి చూద్దాం లాంటి చిత్రాలను రూపొందించారు. 40ఏళ్ల‌కు పైగా ఇండస్ట్రీలో ఉన్న ఆయ‌న దర్శకుల సంఘంలోనూ ప‌నిచేశారు. సోమవారం సాయంత్రం సూర్యాపేట జిల్లాలోని మేడారం గ్రామంలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి. రంగారావు మృతికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

3209
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles