తాను జెర్సీలో చేసింది రెండు సీన్లేనని..అయితే అందులో ఓ మంచి సీన్ ను డైరక్టర్ గౌతమ్ తీసేశారని నటుడు బ్రహ్మాజీ అన్నాడు. ఈ విషయమై బ్రహ్మాజీ మాట్లాడుతూ..జెర్సీలో ఒక్క మంచి సీన్ మాత్రం ఉంచారు. నేను అదృష్టంగా భావిస్తున్నా. సక్సెస్ఫుల్గా ఉన్న హీరోలు ఇలాంటి రిస్కులు చేస్తారు. కానీ నాని గత సినిమా పోయినా చాలా రిస్క్ చేసి ఈ సినిమా చేశారని అన్నారు. పాత్ బ్రేకింగ్ అనేది లైఫ్ రిస్క్ చేస్తేనే వస్తుంది. నాని ఈ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నాడు. చేయడానికి ముందు తను ఏం ఫీలై చేశాడనేది నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఈ టీమ్ అంతా చాలా బాగా చేశారు. గౌతమ్లాంటి వాళ్లు కరెప్ట్ కాకుండా, ఇలాంటి సినిమాలు..వేసవిలో వచ్చిన సినిమాలన్నీ సెన్సిబుల్ సినిమాలే. నాకు మొనాటినస్ పెరిగినప్పుడు నాని దగ్గరకు వెళ్లి యాక్ట్ చేస్తే డీటాక్స్ అయినట్టు అనిపిస్తుందని బ్రహ్మాజీ చెప్పుకొచ్చాడు.